టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి మనందరికీ తెలిసిందే.మొదట అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.
తెలుగులో చివరిగా హ్యాపీ బర్త్డే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.తెలుగులో లావణ్య త్రిపాఠి మంచు విష్ణు, శర్వానంద్, నాగార్జున, నాని, నాగచైతన్య, కార్తికేయ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది.
ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాఠి తాజాగా నటించిన చిత్రం పులిమేక.ఈ సినిమాకు చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
![Telugu Aadi Saikumar, Kona Venkat, Lavanyatripathi, Ott, Puli Meka, Siri Hanuman Telugu Aadi Saikumar, Kona Venkat, Lavanyatripathi, Ott, Puli Meka, Siri Hanuman](https://telugustop.com/wp-content/uploads/2023/02/Kona-Venkat-Lavanya-Tripathi-Puli-Meka-OTT-Release-Date.jpg)
ఈ సినిమాలో లావణ్య పార్టీతోపాటు ఆది సాయికుమార్, సిరి హనుమంత్, సుమన్, గోపరాజు,కరుణాకర్ శర్మ, పల్లవి, రంగారావు, పల్లవి శ్వేత తదితరులు ముఖ్యపాత్రలో నటించారు.ఇకపోతే ఈ సినిమా ఫిబ్రవరి 24 నుంచి జి 5 లో స్ట్రీమింగ్ కానుంది.కాగా ఇటీవలే పులిమేక టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
తాజాగా శివరాత్రి పండుగ సందర్భంగా లావణ్య త్రిపాఠి పాత్రలోని హీరోయిన్ యాంగిల్ ను ఎలివేట్ చేసే స్పెషల్ గ్లింప్స్ ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేసింది.
![Telugu Aadi Saikumar, Kona Venkat, Lavanyatripathi, Ott, Puli Meka, Siri Hanuman Telugu Aadi Saikumar, Kona Venkat, Lavanyatripathi, Ott, Puli Meka, Siri Hanuman](https://telugustop.com/wp-content/uploads/2023/02/Lavanya-Tripathi-Puli-Meka-OTT-Release-Date.jpg)
ఇకపోతే ఆ గ్లింప్స్ లో లావణ్య త్రిపాఠి ముఖానికి అంతా పసుపు పూసుకొని అమ్మోరు లాంటి వేషధారణలో కనిపించింది.చీరకట్టులో చేతిలో గన్ను పట్టుకొని ఫైట్ సీన్స్ ని అదరగొట్టేసింది.ఇకపోతే ఈ పులి మేక లో లావణ్య త్రిపాఠి కిరణ ప్రభ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నటించింది.
ఇకపోతే లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్డే సినిమా తర్వాత పులిమేక సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది.ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ సినిమాలలో నటించలేదు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
అందం అభినయం ఉన్నప్పటికీ అవకాశాలను అందుకోవడంలో లావణ్య త్రిపాఠి వెనక పడుతోంది.