దేవిచౌక్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో దాదాపు 7 కిలోమీటర్లు నడిచి అనపర్తిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు.“ఇదేం కర్మరా” కార్యక్రమంలో భాగంగా.అనపర్తి లో నిర్వహించిన రోడ్ షోకి భారీ ఎత్తున జనం రావడం జరిగింది.ఈ రోడ్ షోలో చంద్రబాబు.సీఎం జగన్ పై అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ పై మండిపడ్డారు.విచిత్రమైన పరిస్థితుల్లో అనపర్తికి రావడం జరిగిందని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ప్రసంగం కోసం స్వయంగా ప్రజలు వాహనం ఏర్పాటు చేశారు.నిచ్చెన సాయంతో ఆ వాహనం పైకి ఎక్కి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యటించే హక్కు నాకు లేదా అని ప్రశ్నించారు.
సైకో పాలనలో ఎన్నో అవమానాలు భరించాను.
![Telugu Chandrababu, Devichowk-Telugu Political News Telugu Chandrababu, Devichowk-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/02/Chandrababu-angry-with-MLA-Suryanarayana-1.jpg )
ప్రజల కోసం ఎన్ని అవమానాలు అయిన భరిస్తా అని అన్నారు.అనపర్తి ప్రజల కోసం ఏడు కిలోమీటర్లు నడిచి వచ్చినట్లు తెలిపారు.గ్రావెల్ సూర్యనారాయణ జాగ్రత్తగా.
ఉండు ఖబడ్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు.నేనేమి తమాషా రాజకీయాలు చేయడం లేదని తెలిపారు.
ఎమ్మెల్యే సూర్యనారాయణ నాతో పెట్టుకున్నారు… వదిలేది లేదు అని హెచ్చరించారు.పెట్రోల్ డీజిల్, నిత్యవసర రేట్లు పెరిగాయి పన్నులు పెంచేశారు చెత్త పై కూడా డబ్బులు దండుకుంటున్నారు అని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో మండిపడ్డారు.
ఈ క్రమంలో ప్రశ్నించే హక్కు తనకు లేదా అని నిలదీశారు.ఇదే సమయంలో పోలీసులపై కూడా ఫైర్ అయ్యారు.
ఆపేసిన తన బండిని తీసుకురావాలని.పోలీసులను హెచ్చరించారు.
నేను ఏమైనా పాకిస్తాన్ నుంచి వచ్చానా.ఎందుకు అడ్డుకుంటున్నారు అని చంద్రబాబు మండిపడ్డారు.