భారతదేశంలో రోజురోజుకు కరెంట్ వినియోగం పెరుగుతూనే ఉంది.ఇక వ్యవసాయానికి వస్తే కరెంట్ వినియోగం తప్పనిసరి.
దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా వ్యవసాయంలో సోలార్ టెక్నాలజీ అభివృద్ధి చెందాలని అడుగులు ముందుకు వేస్తుంది.మనం అక్కడక్కడ సోలార్ సిస్టంతో వ్యవసాయం చేస్తున్నారు అని వినే ఉంటాం.
రామచంద్రపురం అనే గ్రామంలో మిర్చి సాగు చేస్తున్న రైతులు, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చే కొత్త విధానాలను అన్వేషిస్తున్నారు.
చీడ పీడల నుండి మిర్చి పంటను రక్షించడానికి సోలార్ టెక్నాలజీ నీ ఉపయోగిస్తున్నారు.
సోలార్ లైట్లతో చేసిన ప్రయోగం మంచి ఫలితం ఇచ్చింది.కేవలం ఒక సోలార్ లైట్ ధర 3500.
ఒక ఎకరా పంట పొలానికి ఒక సోలార్ లైట్ అవసరం అవుతుంది.పగలంతా సూర్యరశ్మితో చార్జింగ్ అయ్యి రాత్రంతా ఆటోమేటిక్ గా ఈ లైట్లు వెలుగుతాయి.
ఈ సోలార్ లైట్ వెలుగుతో నల్లి పురుగులు, పచ్చ పురుగులు, తెల్ల దోమ లాంటి కీటకాలు సోలార్ లైట్ కు తగిలి ట్రే లో పడి చనిపోతాయి.తద్వారా పురుగు, కీటకాలను చంపడం కోసం రకరకాల పిచికారి మందులను వాడవలసిన అవసరం ఉండదు.పైగా శ్రమ కూడా చాలా తక్కువగా ఉంటుంది.కేవలం రూ.3500 లతో దాదాపు పంట పెట్టుబడిని తగ్గించుకోవచ్చు.
ఈ సోలార్ లైట్ల టెక్నాలజీ గురించి తెలిసిన రైతులు, తమ పొలాలలో ఈ టెక్నాలజీ వాడాలని చాలా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ టెక్నాలజీ కేవలం మిర్చి పంటకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ పంటలలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసే ప్లాన్లో రైతులు వినూత ప్రయోగాలు చేస్తున్నారు.పైగా ప్రభుత్వం కూడా సోలార్ పై మంచి సబ్సిడీ ఇచ్చి రైతులకు అండగా నిలిచింది.
ఈ అద్భుతమైన సోలార్ లైట్ల టెక్నాలజీతో దాదాపుగా సగానికి పైగా శ్రమ తగ్గి, రకరకాల పిచికారి మందుల వినియోగం లేకుండా తక్కువ పెట్టుబడి తో నాణ్యమైన అధిక దిగుబడి పొంది మంచి లాభాలు గడించవచ్చు.