బుల్లితెర స్టార్ యాంకర్ సుమ ఈటీవీలో క్యాష్ షోని క్లోజ్ చేసి లేటెస్ట్ గా సుమ అడ్డా అనే షోని మొదలు పెట్టింది.క్యాష్ గేమ్ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది సుమ అడ్డా కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేయాలని చూస్తుంది.
అయితే సుమ అడ్డాలో కేవలం సుమ ఇంటర్వ్యూనే మాత్రమే కాకుండా జబర్దస్త్ రాజమౌళి విధ్యులేక సత్య శ్రీ ఇలా అందరు షోలో ఎంటర్టైన్ చేస్తున్నారు.ముఖ్యంగా వచ్చిన గెస్ట్ లను రాజముళి తన పేరడీ సాంగ్స్ తో అలరిస్తున్నాడు.
జబర్దస్త్ మానేసినా రాజమౌళికి ఈ సుమ అడ్డా షో బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు.
సుమ అడ్డా లేటెస్ట్ ఎపిసోడ్ లో మ్యూజిక్ డైరక్టర్ ఆర్పీ పట్నాయక్, రఘు కుంచెలు వచ్చారు వారితో పాటుగా సింగర్ శ్రీ కృష్ణ మరో సింగర్ వచ్చారు.
సుమ అడ్డా షోని నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.ఓ పక్క ఇంటర్వ్యూ మరోపక్క జబర్దస్త్ కామెడీ ఇలా అన్ని హంగులతో షోని సక్సెస్ చేసేందుకు కృషి చేస్తున్నారు.
సుమ అడ్డా సరికొత్త ఎంటర్టైనర్ గా నిలిచింది.సుమ కూడా మరింత యాక్టివ్ గా యాంకరింగ్ చేస్తూ అలరిస్తుంది.