టాలీవుడ్ ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా సినిమా రావాలని కోరుకుంటున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ తమ అభిమాన హీరో ను ఎంతో గౌరవంగా అభిమానంగా పిలుచుకునే అభిమానులు మరో వైపు సాయి పల్లవి ని లేడీ పవర్ స్టార్ అంటూ సంబోధిస్తూ ఆమె స్థాయిని అమాంతం పెంచేసిన విషయం తెలిసిందే.
ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులను అలరించిన సాయి పల్లవి ఆ మధ్య వరుసగా సినిమా లు చేసింది.కానీ ఇటీవల ఒక్క సినిమా కూడా తెలుగు లో ఈమె కమిట్ అవ్వలేదు.
లేడీ పవర్ స్టార్ అంటూ ఈమె ను తెగ ఆకాశాన్ని కి ఎత్తుతున్నా కూడా ఆమె కి మాత్రం తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కలగడం లేదు.
![Telugu Fida, Pawan Kalyan, Pawankalyan, Sai Pallavi-Movie Telugu Fida, Pawan Kalyan, Pawankalyan, Sai Pallavi-Movie]( https://telugustop.com/wp-content/uploads/2023/02/pawan-sai-pallavi-Sai-Pallavi.jpg)
ఎంతో మంది స్టార్ హీరోలకు జోడి గా మరియు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఛాన్స్ దక్కినా కూడా నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.హీరోయిన్ గా సాయి పల్లవి ప్రస్తుతం ఒకే ఒక్క తమిళ సినిమా లో నటిస్తోంది.తెలుగు లో మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక్కటి కూడా కమిట్ కాక పోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు వెంటనే కాకున్నా కూడా వచ్చే సంవత్సరం లో అయినా పవన్ కళ్యాణ్ మరియు సాయి పల్లవి కలిసి నటిస్తే చూడాలని ఉంది అంటూ చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు.పవర్ స్టార్ లు ఇద్దరు కలిసి నటిస్తే ఆ సినిమా స్థాయి ఏంటో ఊహించుకోవచ్చు.
ఈజీ గా వందల కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలున్నాయి.సినిమా కంటెంట్ తో సంబంధం లేకుండా వీరిద్దరిని చూసేందుకు.
వెండి తెర పై కనులారా వీరి యొక్క జోడి ని ఆస్వాదించేందుకు చాలా మంది థియేటర్ల ముందు క్యూ కటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, కనుక వీరిద్దరూ కలిసి నటిస్తారా లేదా అనేది చూడాలి.