ఈనెల 14న కొండగట్టుకు సీఎం కేసీఆర్..!!

ఈనెల 14వ తారీకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లా కొండగట్టు పర్యటన ఖరారు అయింది.యాదాద్రి ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి కూడా కొండగట్టుకి రానున్నారు.

 Cm Kcr To Visit Kondagattu On February 14th ,cm Kcr, Kondagattu Temple,100crores-TeluguStop.com

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జేఎన్టీయూ కళాశాలలో హెలిప్యాడ్ మిగతా భద్రత ఏర్పాట్లను జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ పరిశీలించారు.రెండు రోజుల క్రితమే కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి కేసీఆర్ నిధులు కేటాయించడం జరిగింది.

దీంతో దేవాలయ అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద నిధులను మంజూరు చేస్తూ ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Telugu Cm Kcr, Telangana, Yadadri-Telugu Political News

ఈ క్రమంలో 14వ తారీకు ఆలయ పునర్నిర్మాణ పనులను ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయితో కలిసి కేసీఆర్ పరిశీలించనున్నారు.ఈ కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉండటంతో ఆలయ అభివృద్ధికి.100 కోట్లు విడుదల చేయనున్నట్లు గత ఏడాది డిసెంబర్ నెలలో హామీ ఇవ్వడం జరిగింది.ఇచ్చిన హామీ మేరకు ఇటీవల నిధుల విడుదల చేయగా ఇప్పుడు పునర్నిర్మాణ పనులను పరిశీలించడానికి.కేసీఆర్ స్వయంగా ఆలయాన్ని సందర్శించడానికి రావటం పట్ల చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఎప్పటినుండో ఏళ్ల తరబడిగా ఈ ఆలయ అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ఘడియలు వచ్చినట్లు అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube