లోక్సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.అదానీ వ్యవహారంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ క్రమంలోనే మోదీ -ఆదానీ ఫోటోలను రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రదర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం అదానీ గురించే మాట్లాడుతోందని చెప్పారు.
ప్రధాని మోదీ, అదానీ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయని ప్రశ్నించారు.అదానీ కోసం రూల్స్ ను అతిక్రమించారని ఆరోపించారు.
అదానీ సక్సెస్ వెనుక ఎవరు ఉన్నారని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు.పోర్టులు, ఎయిర్ పోర్టులన్నీ అదానీకే కట్టబెడుతున్నారని విమర్శించారు.
మరోవైపు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడుగడునా బీజేపీ అడ్డుకుంటోంది.రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతోంది.