చైతూ 'కస్టడీ' రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త ఏడాదైనా కలిసొచ్చేనా?

అక్కినేని సెకండ్ తరం వారసుడిగా నాగ చైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.వరుస హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక మార్కెట్ సొంతం చేసుకున్నాడు.

 Naga Chaitanya Custody Movie Release Date Details, Naga Chaitanya, Director Venk-TeluguStop.com

అయితే వరుస హిట్స్ అందుకుంటున్న నాగ చైతన్యకు థాంక్యూ వంటి ప్లాప్ తో డీలా పడిపోయాడు.

అయినా వెంటనే చైతూ నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు.

ప్రెజెంట్ తమిళ్ డైరెక్టర్ తో చైతూ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.వెంకట్ ప్రభు తో నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు.విభిన్న చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ తమిళ్ డైరెక్టర్ కు చైతూ అవకాశం ఇచ్చాడు.

NC22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇటీవలే ‘కస్టడీ’ అనే ఆసక్తికర టైటిల్ ను ఆసక్తికర అనౌన్స్ చేసారు.టైటిల్ పోస్టర్ లో చైతూ పోలీస్ గెటప్ లో ఇంటెన్స్ లుక్ తో ఆకట్టు కున్నాడు.ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇందులో మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటించ బోతుంది.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాను మేకర్స్ 2023, మే 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

కొత్త ఏడాదిలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నారట.మరి 2022 ఏడాదిలో బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టిన చైతు ఆ తర్వాత థాంక్యూ సినిమాతో ప్లాప్ ఎదుర్కున్నాడు.

ఆ తర్వాత చైతూ బాలీవుడ్ డెబ్యూ లాల్ సింగ్ చద్దా సినిమా కూడా ప్లాప్ అయ్యింది.దీంతో చైతూ ఆశలు నిరాశ అయ్యాయి.

ఇక కొత్త ఏడాదిలో అయినా చైతూ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube