టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో శర్వానంద్ మహానుభావుడు, శతమానం భవతి, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రాధా, మహాసముద్రం, శ్రీకారం, జాను, పడి పడి లేచే మనసు ఇలా ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇటీవల శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా కంటే ముందు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల అయింది.
అయితే ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
ఆ తర్వాత విడుదలైన ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు శర్వానంద్.
కాగా ఇటీవలే బాలయ్య బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకి హాజరైన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే బాలయ్య బాబుతో కలిసి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
అయితే శర్వానంద్ తదుపరి సినిమా గురించి ప్రేక్షకులలో అనేక ఆలోచనలు వ్యక్తం అవుతున్నాయి.శర్వానంద్ నెక్స్ట్ ఎటువంటి సినిమాలో నటించబోతున్నాడు.
ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు?ఏ దర్శకుడు తో కలిసి పని చేయబోతున్నాడు?ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అలా శర్వానంద్ తదుపరి సినిమా విషయంలో అభిమానులకు క్యూరియాసిటీ పెరిగిపోతుంది.
![Telugu Balakrishna, Krithi Shetty, Sharwanand, Sriram Adittya, Tollywood, Unstop Telugu Balakrishna, Krithi Shetty, Sharwanand, Sriram Adittya, Tollywood, Unstop](https://telugustop.com/wp-content/uploads/2022/12/Sharwanand-Krithi-Shetty-balakrishna-Unstoppable-2.jpg )
కాగా తాజాగా శర్వానంద్ తదుపరి సినిమా విషయంలో ఒక ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతోందీ.శర్వానంద్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తో కలిసి తన సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఆ సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోందట.ఇప్పటికే చేతుల్లో బోలెడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నా కృతి శెట్టి మొదటిసారిగా శర్వానంద్ తో కలిసి రొమాన్స్ చేయబోతోంది.
అయితే ఆదిత్య, శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందా లేకుంటే సక్సెస్ అవుతుందా లేదా చూడాలి మరి.