టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత ప్రేమ పెళ్లి గురించి మనందరికీ తెలిసిందే.వీరిద్దరికి వంశీ సినిమాతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో వీరి వివాహం చేసుకున్నారు.
ఇక నమ్రత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తన ప్రయాణం కొనసాగించారు.అనంతరం తెలుగులో వంశీ సినిమా ద్వారా పరిచయమైనటువంటి నమ్రత మొదటి సినిమాతోనే మహేష్ బాబుతో ప్రేమలో పడ్డారు.
ఇకపోతే నమ్రత ఒక ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నమ్రతకు యాంకర్ నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
మీరు పూర్తిగా నార్త్ అమ్మాయినీ పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి వాతావరణం మీకు ఎలా సెట్ అయింది అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ ప్రశ్నకు నమ్రత సమాధానం చెబుతూ…మహేష్ బాబుతో డేటింగ్ లో ఉన్న సమయంలోనే తాను ఎక్కువగా తన సినిమా షూటింగ్ లోకేషన్లకు వెళ్లేదాన్ని తెలిపారు.
షూటింగ్ పూర్తి అయిన తర్వాత మహేష్ బాబుతో కలిసి చాలా సంతోషంగా గడిపే దానిని.డేటింగ్ లో ఉన్న సమయంలో మహేష్ అసలు బోర్ కానివ్వలేదనీ ఈమె తెలిపారు.
![Telugu Bollywood, Mahesh Babu, Manjula, Namrata, Namratamahesh, Vamsi-Movie Telugu Bollywood, Mahesh Babu, Manjula, Namrata, Namratamahesh, Vamsi-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/12/Namrata-made-interesting-comments.jpg )
మహేష్ బాబుతో పాటు ఆయన స్నేహితులు తన సోదరి మంజులతో కలిసి కూడా బాగా పార్టీలకు వెళ్లే వాళ్లమని, ఇలా అందరం కలిసి చిల్ అవుతూ ఎంజాయ్ చేసేవాళ్ళం.మహేష్ బాబుతో ఉన్నప్పుడు నాకు ఒంటరి అనే ఫీలింగ్ కలగలేదని, ఆ ఫీలింగ్ మహేష్ తనకి ఎప్పుడు కలగనివ్వలేదని ఈమె తెలిపారు.ఇక తనతో డేటింగ్ లో ఉన్న సమయంలో తాను తరచూ హైదరాబాద్ టు ముంబై వెళ్లి వచ్చేదాన్ని అందుకే నాకు ఇక్కడి వాతావరణం పెద్దగా కష్టమేమీ అనిపించలేదు అంటూ ఈ సందర్భంగా నమ్రత అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.