ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే.మోడీ పర్యటనకు ముందు… పొత్తులకు సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పొత్తులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.రివ్యూ మీటింగ్ లో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీకి వేరే పార్టీతో పొత్తు ఉందని.
బయట విష ప్రచారం చేస్తున్నారు.గతంలోనూ ఈ రీతిగానే దుష్ప్రచారం చేశారు.
దీన్ని బలంగా ఢీకొట్టేలా జనసైనికులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ధైర్యంగా చెబుతారని తెలియజేశారు.
మూడో ప్రత్యామ్నాయం ఎదుగుతున్న నేపథ్యంలో.రెండు పార్టీలు భయంతో జనసేనపై విష ప్రచారం చేస్తున్నాయని అన్నారు.ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రశ్నిస్తున్న వారిని ఈ విధంగా ఇబ్బందులు పెట్టే ప్రభుత్వాన్ని గతంలో తాను ఎప్పుడు చూడలేదని.వైసిపి పై మండిపడ్డారు.
ఉమ్మడి నియోజకవర్గం జిల్లాల సమీక్ష సమావేశంలో.నియోజకవర్గంలోని సమస్యలు మరియు పార్టీ బలోపేతంపై జనసైనికుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.
ఎస్సీ.ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిగా గాలికి వదిలేసారని విమర్శించారు.
దీంతో బీసీ, ఎస్టీ.సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేస్తూ గిరిజనులకి మౌలిక వసతులు కూడా కల్పించటం లేదని ప్రభుత్వంపై నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.