హీరోయిన్ల విషయంలో పులిహోర కలపటానికి రెడీగా ఉంటారు పులిహోర రాజాలు.వాళ్లని ఇంప్రెస్ చేయడానికో లేక టైం పాస్ కో కానీ ఎవరైనా సెలబ్రిటీలు ఫోటో పెడితే చాలు వెంటనే కామెంట్ లతో పొగుడుతారు.
పొగడమే కాదు వేరే అందగత్తెలతో పోలుస్తూ ఉంటారు.ఇప్పటికే చాలామంది పులిహోర రాజాలు అసలు పోలిక లేకున్నా కూడా అమ్మాయిలను హీరోయిన్ల ఫేస్ లతో పులిహోరలు కలిపారు.
ఇక తాజాగా జబర్దస్త్ వర్షపై కూడా ఓ నెటిజన్ పులిహోర కలిపాడు.
జబర్దస్త్ వర్ష గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
తొలుత బుల్లితెరపై పలు సీరియల్ లలో నటించింది వర్ష.దీంతో కొంతవరకు మాత్రమే ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
అయితే ఎప్పుడైతే జబర్దస్త్ లో గెస్ట్ గా అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయిందో ఇక అప్పటినుంచి జబర్దస్త్ లో కమెడియన్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
దీంతో ఆమెకు జబర్దస్త్ ద్వారా మరింత పరిచయం పెరిగింది.
ఇక అందులో మరో కమెడియన్ ఇమ్మానుయేల్ తో ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.అతనితో ప్రేమించిన అమ్మాయిగా ప్రవర్తిస్తుంది.
నిజానికి వీళ్ళ ప్రవర్తన చూస్తే బాగా మితిమీరి ఉంటుంది.ఇక ఈ షో లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా బాగా సందడి చేస్తుంది వర్ష.

అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్లలో పాల్గొంటే.తన డాన్సులతో, అల్లర్లతో తెగ రచ్చ చేస్తుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఎంతలా అంటే ఈమె చేసే గ్లామర్ షో కింద ఏ హీరోయిన్ కూడా పనికిరాదు అన్నట్లుగా చేస్తుంది.
నిజానికి వర్ష చేసే గ్లామర్ షో మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు.
తన అందాలతో కుర్రాళ్లను తన వైపు లాక్కుంది.
ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.బాగా ఫోటో షూట్లు చేయించుకుంటూ వాటిని వెంటనే నెట్టింట్లో పెట్టి రచ్చ చేస్తుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా వాటిని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ గా మారాయి.

ఇందులో తన అందాలతో గ్లామర్ విందును వడ్డించింది.ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ బాగా లైకులతో పాటు కామెంట్లు పెడుతున్నారు.అయితే ఓ నెటిజన్ అచ్చం జూనియర్ తమన్నా లాగా ఉన్నావు అంటూ పులిహోర కలిపాడు.దీంతో అతను చేసిన కామెంట్ కి కొంతమంది ట్రోలర్స్.బాబోయ్ ఆమె జూనియర్ తమన్నా. అసలు ఆమెకు తమన్నాకు ఏమైనా పోలికలు ఉన్నాయా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.ఇక వర్ష ప్రస్తుతం సీరియల్స్ కు దూరంగా ఉంటూ కేవలం షో లలో, సోషల్ మీడియాలలో బాగా బిజీగా మారింది.