South Heroes Reject Bollywood Movies: మహేష్ బాబు నుంచి రిషబ్ శెట్టి వరకు బాలీవుడ్ కి నో చెప్తున్నా హీరోలు వీరే !

సౌత్ సినిమాల్లో నటించే హీరోలకు కొంతకాలం కిందట వరకు బాలీవుడ్ సినిమాల్లో నటించడం అంటే పెద్ద కల.సీన్ కట్ చేస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

 South Indian Heros Said No To Bollywood Rishab Shetty Naveen Pauli Mahesh Babu A-TeluguStop.com

మన సౌత్ లోనే పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి.ఏకంగా మన సౌత్ సినిమాలు బాలీవుడ్ ని కూడా శాసిస్తున్నాయి.

అందుకే మన హీరోలకి ఇప్పుడు బాలీవుడ్ పెద్ద విషయం ఏమీ కాదు.అందుకే చాలామంది హీరోలు హిందీకి వెళ్లి సినిమాలు చేయడానికి నో చెప్తున్నారు.

పైగా హిందీలో నేరుగా సినిమాలు తీస్తే హిట్ అవుతున్న దాఖలాలు తక్కువగానే ఉన్నాయి.ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టిన, వందల కోట్ల రూపాయలు కుమ్మరించిన వసూళ్లు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.

దాంతో బాలీవుడ్ హీరోలే మన సౌత్ మేకర్స్ తో సినిమాలు చేస్తున్నారు.మరి అలా సౌత్ ఇండియా హీరోలు బాలీవుడ్ కి నో చెప్పిన వారెవరో చూద్దాం.

రిషబ్ శెట్టి

Telugu Allu Arjun, Anurag Kashyap, Bollywood, Heroesreject, Mahesh Babu, Naveen

కన్నడలో ప్రస్తుతం రిషబ్ శెట్టి హవా కొనసాగుతోంది కాంతారా సినిమా కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో అతనిలో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం ఈ సినిమా దుమ్ము దులిపింది.దాంతో ఇకపై పూర్తిగా కన్నడలోనే సినిమాలు తీయాలని అతడు డిసైడ్ అయిపోయాడట.తను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం కనడ సినిమా పరిశ్రమ మాత్రమే అంటూ కుండ బద్దలు కొట్టేస్తున్నాడు.

మహేష్ బాబు

Telugu Allu Arjun, Anurag Kashyap, Bollywood, Heroesreject, Mahesh Babu, Naveen

ఇక ఎప్పటినుంచో మహేష్ బాబు బాలీవుడ్ అంటే నో చెప్తూనే ఉన్నాడు.మనకు తెలియని చోటుకెళ్లి పాట్లు పడే కన్నా కూడా తెలిసిన చోట ప్రశాంతంగా బ్రతకడమే తనకి ఇష్టం అంటూ కొన్నేళ్లుగా బాలీవుడ్ పై చిన్నచూపు చూస్తున్నాడు మహేష్.ఇటీవల కాలంలో అతడు నిర్మించిన మేజర్ సినిమా సమయంలో కూడా ఈ ప్రశ్న తలెత్తితే ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాడు.తాను బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదు అని తనకు తెలుగు సినిమా పరిశ్రమ చాలు అంటూ చెప్పేశాడు.

అల్లు అర్జున్

Telugu Allu Arjun, Anurag Kashyap, Bollywood, Heroesreject, Mahesh Babu, Naveen

ఇక పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు అల్లు అర్జున్.ఇతను కూడా బాలీవుడ్ లో నేరుగా సినిమా చేయడానికి ఇష్టంగా లేడు.నాకు తెలుగు సినిమా పరిశ్రమ అంటే ఎంతో కంఫర్ట్ జోన్.దాని నుంచి పక్కకు వెళ్లి ఆలోచించాల్సిన అవసరం లేదు.ఇకపై కూడా తెలుగులోనే సినిమాలు చేస్తాను.అవి హిందీలోకి డబ్బు చేసుకుంటే పర్వాలేదు.

కానీ నేరుగా సినిమా తీసే అవకాశాలు లేవు అంటున్నాడు.ఇక అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాలకు హిందీలో మంచి డిమాండ్ ఉంది.

నవీన్ పాలి

Telugu Allu Arjun, Anurag Kashyap, Bollywood, Heroesreject, Mahesh Babu, Naveen

ఇక సౌత్ లో చెప్పుకోదగ్గ మరొక హీరో నవీన్ పాలి ఇతడు మలయాళ భాషలో అన్ని జోనస్ లు కూడా మంచి మంచి సినిమాలు తీశారు అయితే మలయాళ సినిమాల్లో మాత్రమే నటిస్తున్న నవీన్ కి హిందీ సినిమా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అవకాశం ఇచ్చాడు.కానీ నవీన్ అందుకు నో చెప్పాడు.బాలీవుడ్ లో నటించడానికి తనకు ఇంట్రెస్ట్ లేదని క్లారిటీ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube