RRR Japan Collections: ఆర్‌ఆర్‌ఆర్‌ : జపాన్ లో డే 1 కంటే డే 21 ఎక్కువ

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమా తాజాగా జపాన్ లో విడుదలైన విషయం తెలిసిందే జపాన్‌ లో సినిమా ను ప్రమోట్ చేయడం కోసం హీరోలు ఇద్దరు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా జపాన్ కుటుంబ సమేతంగా వెళ్లారు.అక్కడ నాలుగు ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.

 Rrr Movie Japan Collections Details, Ntr, Rajamouli, Ram Chara, Rrr Movie, Rrr M-TeluguStop.com

ఆ తర్వాత సినిమా విడుదల సందర్భంగా కూడా అక్కడే ఉన్నారు.సినిమా విడుదలైన తర్వాత వస్తున్న కలెక్షన్స్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.

జపాన్ లో అంత భారీ ఎత్తున ప్రచారం చేసి విడుదల చేసినా కూడా ఫలితం లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.

కానీ తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా మొదటి రోజు కంటే 21వ రోజు ఎక్కువ కలెక్షన్స్ నమోదు చేసిందట.

ఈ స్థాయిలో సినిమా అక్కడ కలెక్షన్స్ నమోదు చేస్తుంది.కనుక అక్కడ సూపర్ హిట్ అన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది.రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా.రాం చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటించారు.ఆలియా భట్ సీత పాత్ర లో కనిపించింది.అజయ్ దేవగన్ మరియు శ్రియ శరణ్ కీలక పాత్ర లో నటించారు.

Telugu Ajay Devgan, Alia Bhatt, Rajamouli, Rajamouli Rrr, Ram Charan, Rrr Japan,

హీరోయిన్ గా నటించిన అలియా భట్ కి ఎక్కువ ప్రాముఖ్యత లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.జపాన్ గా విడుదలైన భారీ సినిమా అవడం తో పెద్ద ఎత్తున కలెక్షన్స్ నమోదు అవుతాయని అంతా భావించారు.కానీ సినిమా విడుదల విషయం లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు అంతా అంచనాలు లేవని కొందరు భావించారు.కానీ రోజులు గడుస్తున్నా కొద్ది సినిమా కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి.

ఎట్టకేలకు సినిమా భారీ వసూలను నమోదు చేసిందంటూ చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube