Sanvi Srivatsava: ఫెడ్ అవుట్ అయినా ఈ హీరోయిన్ అక్క కూడా ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా ?

శాన్వి శ్రీవాత్సవ.ఈ పేరు చెప్తే గుర్తు పట్టడం చాల కష్టం.

 Shanvi Srivatsava Sister Also Heroine , Shanvi Srivatsava, Ramgopal Verma, Manch-TeluguStop.com

కానీ లవ్లీ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు.వారణాసిలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు లేడీ డైరెక్టర్ బి జయ దర్శకత్వంలో వచ్చిన లవ్లీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.

దాంతో ఆ పేరు లవ్లీ గా స్థిరపడి పోయింది.ఇక లవ్లీ సినిమా తర్వాత ఆ సుశాంత్ హీరోగా వచ్చిన అడ్డా సినిమాలో ఈ అమ్మడు బాగానే నటించి పేరు సంపాదించుకుంది.

అయితే అడ్డా సినిమా తర్వాత శాన్వికి తెలుగు సినిమా పరిశ్రమలో అవకాశాలు పెద్దగా రాలేదనే చెప్పాలి.దాంతో కన్నడ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

కన్నడలో చంద్రలేఖ అనే సినిమాలో మొదటిసారిగా నటించింది శాన్వి.

ఆ తర్వాత మంచు విష్ణు హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రౌడీ అనే సినిమాలో నటించడంతో మరింత గుర్తింపు వచ్చింది.

అలాగే మంచు విష్ణు సోదరుడైన మంచు మనోజ్ సినిమా ప్యార్ మై పడిపోయానే అనే సినిమాలో సైతం ఈ అమ్మడు నటించిన ఎందుకో గాని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించలేదు.అయితే వర్మ దర్శకత్వం లో శాన్వి బాగానే అందాలు ఆరబోసింది.

ఈ చిత్రం తర్వాత ఎంతో పెద్ద హీరోయిన్ అవుతుందనుకున్నా శాన్వి కేవలం నాలుగు అంటే నాలుగు తెలుగు సినిమాలతో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయింది.అయితే ఈమె పూర్తిగా నటించడం అయితే మానేయలేదు.

ప్రస్తుతం కన్నడలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది.

Telugu Rowdy, Jaya, Lovely, Manchu Vishnu, Ramgopal Verma, Times Desirable, Toll

2014 నుంచి 2022 వరకు దాదాపు ఏకంగా 13 కన్నడ సినిమాల్లో నటించింది శాన్వి.ఇక 2022 లో సైతం నాలుగు సినిమాల్లో నటిస్తే అందులో ఒక మలయాళం సినిమాలో సైతం ఓ చిత్రంలో నటించడం విశేషం.తెలుగు ప్రేక్షకులు తిరస్కరించిన శాన్వి ని కన్నడ అభిమానులు బాగానే ఓన్ చేసుకున్నారు.ఇక శాన్వి సోదరి విదిష శ్రీవాత్సవ కూడా హీరోయిన్ కావడం విశేషం.2019 సంవత్సరానికి గాను శాన్వి ది టైమ్స్ మోస్ట్ డిజైనబుల్ ఉమెన్ గా 20వ స్థానంలో నిలిచింది.ఇక ప్రస్తుతం తెలుగులో పూర్తిగా సినిమాలు మానేసిన శాన్వి భవిష్యత్తులో ఆయన తెలుగు సినిమాల్లో రాణించాలని కోరికతో ఉన్నట్టుగా ఇటీవల ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలపడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube