హెయిర్ ఫాల్ సమస్య( Hair fall problem ) తీవ్రంగా వేధిస్తోందా.? జుట్టు రోజురోజుకు విపరీతంగా ఊడిపోతుందా.? ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడం లేదా.? అయితే చింతించకండి.ఎందుకంటే హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్న సరే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ ను వాడితే ఈజీగా చెక్ పెట్టవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా రెండు అంగుళాల అల్లం ముక్కను( ginger ) తీసుకుని పొట్టు తొలగించి సన్నగా తరుముకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అల్లం తురుము వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులను ( Sesame seeds )వేసుకోవాలి.చివరిగా ఎనిమిది టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్( Olive oil ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసి నాలుగు గంటల పాటు వదిలేయాలి.
ఆ తర్వాత ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి కనీసం పది నిమిషాల పాటు హిట్ చేయాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో హీట్ చేసిన ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ కు బాగా అప్లై చేసుకొని కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
మరసటి రోజు మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే కుదుళ్లు బలోపేతం అవుతాయి.జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.అదే సమయంలో కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.పైగా ఈ ఆయిల్ ను వాడటం వల్ల చుండ్రు సమస్య ఉన్న దూరం అవుతుంది.కాబట్టి విపరీతమైన హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ పవర్ ఫుల్ ఆయిల్ ను వాడేందుకు ప్రయత్నించండి.