మేజర్, గూఢచారి,వంటి సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి శోభిత ధూళిపాళ ఒకరు.ఇలా పలు తెలుగు సినిమాలలో నటిస్తూ ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఈమె గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
నటి శోభిత టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యతో ప్రేమలో పడ్డారని ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ విధంగా నాగచైతన్య శోభిత గురించి వార్తలు రావడంతో వీరిద్దరూ దాదాపు పెళ్లి చేసుకుంటారని అందరూ భావించగా నాగచైతన్య అభిమానులు మాత్రం సమంత ఉద్దేశపూర్వకంగానే చైతన్య పై ఇలాంటి దుష్ప్రచారాలు చేయిస్తుంది అంటూ మండిపడ్డారు.
ఈ వార్తలపై స్పందించిన శోభిత అందరికీ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.ఇలా నాగచైతన్యతో డేటింగ్ రూమర్లు వచ్చిన అనంతరం ఈమె సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.
ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజన్లు ఏంటీ శోభితకు పెళ్లయిపోయిందా అంటూ షాక్ అవుతున్నారు. ఈమె సోషల్ మీడియా వేదికగా పెళ్లి దుస్తులను ధరించి పెళ్లికూతురుల ముస్తాబయి మరొక వ్యక్తి చేతిలో చేయి వేసి నడుచుకుంటూ వస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.ఈ ఫోటోలను షేర్ చేస్తూ వెడ్డింగ్స్ ఇన్ దుబాయ్ అంటూ క్యాప్షన్ జోడించారు.దీంతో ఈమె పెళ్లి చేసుకుందని అందరూ భావించారు నిజానికి శోభిత ఎలాంటి పెళ్లి చేసుకోలేదని కేవలం పెళ్లి యాడ్ షూట్ కోసం ఇలా పెళ్లికూతురులా ముస్తాబయి ఫోటోలు దిగారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.