Rishabh Shetty Kantara : కాంతార సినిమా నటీనటుల రెమ్యూనరేషన్లు ఎంతో తెలుసా?

సాధారణంగా ఒక భాషలో వచ్చిన సినిమా మంచి విజయం సాధిస్తే ఆ సినిమాని ఇతర భాషలలో కూడా విడుదల చేయడం సర్వసాధారణం ఇలా కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి చిత్రం కాంతార.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని అన్ని భాషలలో కూడా విడుదల చేశారు.

 Do You Know The Remunerations Of Kantara Movie Actors , Kantara Movie ,rishabh-TeluguStop.com

ఈ సినిమా కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా ఏకంగా 250 కోట్ల రూపాయలను రాబట్టింది అంటే ఈ సినిమా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో అర్థం అవుతుంది.ఇలా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి ఎంతోమంది ప్రశంసలు కురిపించారు.

కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ నటి సంయుక్త గౌడ్ హీరోయిన్ గా నటించారు.ఈ సినిమాని కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంభలే ఫిలిమ్స్ నిర్మాణంలో కేవలం 16 కోట్ల రూపాయల నిర్మాణంతో తెరకెక్కింది.

ఇలా ఇండస్ట్రీ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో నటించిన నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది.

Telugu Achyut Kumar, Kantara Actors, Kantara, Kishore, Rishabh Shetty, Sanyukta

ఈ సినిమా కోసం హీరో రిషబ్ శెట్టి నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.అదేవిధంగా నటి సంయుక్త గౌడ్ 1.25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన కిషోర్ కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోగా, నెగిటివ్ పాత్రలో నటించిన అచ్యుత్ కుమార్ 75 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.ఇలా అత్యంత తక్కువ రెమ్యూనరేషన్లతో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లను రాబట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube