గవర్నర్ తమిళిసై వాస్తవాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు.గవర్నర్ పై బీజేపీ ముద్ర వేసి అవమానిస్తున్నారని మండిపడ్డారు.
ఏకంగా గవర్నర్ వ్యవస్థనే టీఆర్ఎస్ కించపరుస్తోందని ఆయన విమర్శించారు.కల్వకుంట్ల రాజ్యాంగం బ్యాచ్ నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేమని ఎద్దేవా చేశారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రాజ్ భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.