రాజధాని రైతుల మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.శాంతిభద్రతల దృష్ట్యా నిన్న రైతుల పాదయాత్రకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
దీంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అమరావతి రైతుల పిటిషన్ ను మొదటి కేసుగా హైకోర్టు విచారించింది.
ఈ క్రమంలో పరిమిత ఆంక్షలతో 600 మంది పాదయాత్ర చేసుకోవచ్చని తెలిపింది.అందుకు పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అనంతరం దాన్ని పరిశీలించి పోలీసులు మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.