ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.అయితే సినిమాలో వరుసగా విడుదల అవుతున్నప్పటికీ కేవలం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్నాయి.
కంటెంట్ లేని సినిమాలు ఒకటి రెండు రోజులు మాత్రమే థియేటర్లలో ఆడుతున్నాయి.సినిమా నెగటివ్ టాక్ వచ్చింది అంటే అది స్టార్ హీరో సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా సరే ప్రేక్షకులు ఒకే విధంగా చూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ప్రస్తుతం ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది.అదేమిటంటే స్టార్ హీరోల కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సినిమాలను వారి పుట్టినరోజు సందర్భంగా లేదంటే ఆ సినిమాలు విడుదలై కొన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
ఇటీవలే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాలు విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటి యువత ఈ రెండు సినిమాలను విపరీతమైన క్రేజ్‌తో ఆదరించారు.
అలాగే రెండు సినిమాలు కూడా కోట్లలోనే కలెక్షన్ రాబట్టాయి.అంటే ఈ సినిమాలలో ప్రేక్షకులకు నచ్చిన కంటెంట్ ఉంది కాబట్టి అందుకనే ఇన్నేళ్ల తరువాత కూడా ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించగలిగాయి.
అయితే ఈ రెండు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకులు ఒక పది సార్లు చూసినా కూడా అలాగే ఈ సినిమాలు ఓటిటిలో ఉన్నా కూడా మళ్లీ థియేటర్స్ లో చూశారు అంటే ఆ సినిమాలలో తమ అభిమాన హీరోలు ప్రేక్షకులు అభిరుచికీ తగ్గట్టుగానే చేసి ఉండవచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు ఈ విధంగా సక్సెస్ కాలేకపోతున్నాయి.దీన్నిబట్టి చూస్తుంటే ఇప్పటి సినిమాలలో ప్రేక్షకులు కోరుకుంటున్న అంశాలు ఇవ్వలేకపోతున్నారు ఏమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అయితే గత చిత్రాలను ఇంత ఎగ్జైట్‌మెంట్‌తో చూశారు అంటే అందులో హీరోల నటన మాత్రమే కాదు, కథలో కొత్తదనం, వినోదం, పాటలు అద్భుతంగా ఉండడం.
కాబట్టె పాత సినిమాలు అయినా కూడా ఆ సినిమాలు ఇప్పుడు విడుదల అయ్యి ట్రెండ్ సృష్టించాయి.ఇప్పుడు కూడా అదే చిత్రాలను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అంటే అప్పటి కథల్లో ఏముంది? ఇప్పుడు ఏం మిస్ అయింది అన్నది హీరోలు, మేకర్స్ గుర్తించడం లేదు.పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి హీరోలో కాకుండా, మిగతా హీరోలు కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.మరి ఇప్పటినుంచి అయినా దర్శక నిర్మాతలు అభిమానులు కోరుకుంటున్నా సినిమాలను తీసుకువస్తారో లేదో చూడాలి మరి.