తీవ్రమైన నేరం కింద దోషిగా నిర్ధారించబడిన వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష మరియు RS.100/-జరిమానా విధిస్తూ.ఖమ్మం జిల్లా సెషన్ కోర్టు గౌరవ ప్రధాన న్యాయముర్తి శ్రీ డా,,టి శ్రీనివాసరావు గారు ఈరోజు తీర్పు వెల్లడించారు.మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘడ్ జిల్లా పీపటోలాకు చెందిన కొంతమంది కూలీలు గత ఏడాదిలో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎన్వీ బంజారకు వ్యవసాయ కూలీ పనుల కోసం వచ్చి పనులు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఓ రైతు వద్ద పనిచేయగా వచ్చిన కూలీ డబ్బుల విషయంలో ఇద్దరు కూలీలు దయాళ్, మడివి సేత్రాం అనే వ్యక్తుల మధ్య వాగ్వాదం తలెత్తింది.మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు.
ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ సమయంలోనే క్షణికావేశానికి గురైన మడివి సేత్రాం అనే వ్యక్తి కూరగాయలు తరిగే చాకుతో దయాళ్ ఛాతీపై బలంగా పొడవటంతో దయాళ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
వంద రూపాయల కారణంగానేమడివి, దయాళ్ మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఇతర కూలీలు, స్థానికులు ఈ ఘటన చూసి భయభ్రాంతులకు గురయ్యారు.వెంటనే నిందితుడిని బంధించి పోలీసులకు అప్పగించారు.
గత ఏడాది ఆక్టోబర్ 11న రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పోలీసులు నిందితుడిని విచారించారు.ఈ విచారణలో కూలీ డబ్బుల విషయంలో వంద రూపాయల విషయంలో తలెత్తిన వివాదం వల్లనే దయాళ్‌పై దాడి చేసి చంపినట్లు మడివి సేత్రాం.
అంగీకరించగా.కేసు పకడ్బందిగా విచారించిన అప్పటి ఖమ్మం రూరల్ సిఐ సత్యనారాయణ రెడ్డి చార్జ్ షీట్ న్యాయస్థానానికి సమర్పించారు.
సకాలంలో నిందుతుడికి శిక్ష పడటంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్ గారు, లైజనింగ్ ఎస్సై వెంకటేశ్వర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ రవికిశోర్, హోంగార్డు యూసుఫ్ కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ గారు అభినందించారు.