టీడీపీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి కుప్పంలో జరిగిన ఘటనలే నిదర్శనమని మంత్రి జోగి రమేష్ అన్నారు.చంద్రబాబు ఇక రాష్ట్రంలో తిరిగే పరిస్థితులు కనిపించడం లేదని ఆయన విమర్శించారు.
చంద్రబాబు జెండాను, పార్టీని వేర్లతో సహా పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారని వ్యాఖ్యనించారు.సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి చేయలేని చంద్రబాబు.
రాష్ట్రానికి ఏం చేస్తావ్.? అని ప్రశ్నించారు.రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమికి గురవుతుందని ధీమా వ్యక్తం చేశారు.