టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటన చేపడుతున్న సంగతి తెలిసిందే.మూడు రోజుల పర్యటనలో మొదటి రోజే నిన్న వైసీపీ మరియు టీడీపీ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
ఇక రెండో రోజు నేడు రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు నువ్వా నేనా అన్నట్టుగా నియోజకవర్గంలో వ్యవహరించడంతో భారీగా పోలీసులు మోహరించారు.కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేతుల మీదగా ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ నీ వైసీపీ నాయకులు ధ్వంసం చేయడం జరిగింది.
దీంతో ద్వాంశమైన అన్న క్యాంటీన్ ఏదుటే రోడ్డుపై బైఠాయించి.చంద్రబాబు నిరసన తెలిపారు.ఇదిలా ఉంటే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవడం పట్ల దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ కీలక నేత చింతమనేని ప్రభాకర్ ఆందోళన నిర్వహించారు.పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ధ్వంసం చేయటాని తప్పుపట్టారు.
అధికార పార్టీ వైసీపీ నేతలు ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు.వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.