తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకూ రాజకీయ వైరం అంటే కేవలం ఆరోపణలు విమర్శలే తప్ప అరెస్టులు, జైలు శిక్షలు అన్నవి తెలుగు రాజకీయ చరిత్రలో లేవు.ఒకప్పుడు హోరాహారిగా పోరాడిన వైయస్సార్- చంద్రబాబు( YSR-Chandrababu ) సమయంలో కూడా అనేక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే పరిణామాలు ఏర్పడినా కూడా ఇలా ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడానికి తెగింపు చూపించిన మొదటి తెలుగు ముఖ్యమంత్రిగా జగన్ నిలబడి పోయారు.
దీనిని బట్టి తన రాజకీయ ప్రయాణం లో తనను పెట్టిన ఇబ్బందులను, తాను ఎదుర్కొన్న అవమానాలను జగన్ గుర్తుపెట్టుకున్నారని ఇప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నారని వైసీపీ శ్రేణులు( YCP Activists ) వ్యాఖ్యానిస్తున్నాయి.
అయితే గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది చాలా ప్రమాదకరమైన ఆట “అధికారం అన్నది కేవలం ఐదు సంవత్సరాల పరిమితి మరియు అనేక షరతులకు లోబడి ఉంటుంది “ ప్రజాస్వామ్యంలో( Democracy ) నిరంతరం ప్రజలను ఆకట్టుకొని, అభిమానాన్ని సంపాదించుకుంటే తప్ప వరుసగా గెలిచే అవకాశం ఏ పార్టీకి ఉండదు.అలా దేశవ్యాప్తంగా అతి కొన్ని పార్టీలు మాత్రమే ఈ ఫీట్ను విజయవంతంగా చేయగలిగాయి.కానీ ఒక్కసారి గనుక పరిస్థితులు తారుమారు అయి వారు వీరైతే ఇప్పుడు తాము ఆడుతున్న ఆటనే అవతలి వర్గం కూడా ఆడితే ఇక రాజకీయ వైరం కాస్త పూర్తిస్థాయి వ్యక్తిగత వైరంగా మారిపోతుంది.
ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం అయితే కాదు .
అయితే చట్టానికి అందరూ సమానమే అని తప్పు చేసిన వారు ఎంత పెద్ద స్థాయి నేత అయిన శిక్ష అనుభవించవలసిందే కదా అనవచ్చు అయితే ఆ చట్టం తన పని తన స్వభావసిద్ధమైన పునాదుల మీదే అమలు చేయబడుతుందా లేక బలవంతంగా రుద్ద పడుతుందా అన్నది కూడా చూడాలి .ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) తర్వాత వైసీపీ చేసుకున్న నేతలు కొంతమంది చేసుకొన్న సంబరాలను చూస్తే చట్టం చాలా బలవంతంగా తన పని తాను చేస్తున్నట్లుగా కనిపించింది.అయితే తన దూకుడుతో ఒక్కసారిగా రాజకీయ ఆట కు నియమాలను మార్చేసిన జగన్( YS Jagan ) దాని పలితం కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండే ముందుకు వెళుతున్నారని జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది మరి ప్రజలు తనవైపు ఉన్నారన్న ధీమానో లేక అధికారం ఉండగానే ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలో తెలియదు కానీ తాను అనుకున్నది మాత్రం జగన్ చేసి చూపించారు అని చెప్పవచ్చు .