కేంద్రానికి నూకలు చెల్లాయి రైతుల శాపం ఊరికే పోదు కేంద్రం చక్రవర్తి కాదు .రాష్ట్రాలు సామంతులు కాదు కాలంచెల్లిన సమయం వచ్చిందే కాబట్టే కేంద్రం మూర్ఖంగా వ్యవహరిస్తున్నది తెలంగాణకు త్యాగం ఒక ఊపిరి .
అనేక పోరాటాలలో ప్రాణాలు, ఆస్తులు త్యాగం చేసిన చరిత్ర, వారసత్వం తెలంగాణది స్వతంత్ర పోరాటం నుండి తెలంగాణ సాయుధ పోరాటం వరకు, 1969 తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నుండి ఢిల్లీలో రైతుల 13 నెలల ఆందోళన వరకు రైతుల భాగస్వామ్యం ఉన్న పోరాటాలన్నీ విజయవంతమయ్యాయ 13 నెలల ఉత్తరాది రైతుల అలుపెరగని పోరాటానికి తప్పనిసరై మోడీ రెండు చెంపలు వేసుకుని నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నాడుతెలంగాణ వరి ధాన్యం కొనాలన్న రైతుల పోరాటానికి కేంద్రం తలొగ్గాల్సిందే .దేశంలో ఎక్కడ పండించిన పంట అయినా కేంద్రం కొనుగోలు చేయాలి
వానాకాలం నాట్లకు ముందే యాసంగి వరి ధాన్యం ఎంత కొంటారు ? ఏం చేస్తారు ? అని తెలంగాణ ప్రభుత్వం తరపున కోరడం జరిగింది .రైతులను ముందే జాగృతం చేయాలని కేంద్రాన్ని కోరాం తెలంగాణ బీజేపీ సన్నాసులు వానాకాలంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల గురించి ఎందుకు ? అని ఎద్దేవా చేశారు పలుమార్లు కేంద్రాన్ని యాసంగి కొనుగోళ్లపై ఏ విషయం చెప్పాలని కోరాం .మూడేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం చెప్పింది కేంద్రం ఉద్దేశాన్ని పసిగట్టి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులను కోరాం అ దిశగా రైతులను ప్రోత్సహించాల్సిన తెలంగాణ బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారు రైతులు వరి వేయాలి .మేము కేంద్రంతో కొనిపిస్తాం అని అన్నారు .ఇప్పుడు నోరు తెరవడం లేదు లక్షా 50 వేల కోట్లతో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాం . రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు ఇచ్చి రైతులకు కేసీఆర్ అండగా ఉంటున్నారు
స్వాతంత్ర్యం వచ్చాక పంజాబ్ లో భాక్రానంగల్ డ్యాం నిర్మించారు .వరి, గోధుమలను సాగుచేయించి దేశమంతా కంట్రోల్ షాపుల ద్వారా సరఫరా చేస్తూ వచ్చారు 50 ఏళ్లుగా దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ ను ఏడేళ్లలో తెలంగాణ అధిగమించింది పంజాబ్ ఏడాదిలో రెండు కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తే .తెలంగాణ మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండించింది పంజాబ్ కు 50 ఏళ్లుగా కేంద్రం సహకారం ఉంది .తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో, ఉచిత కరంటులో, రైతుబంధు, రైతుభీమాలలో కేంద్రం తోడ్పాటుపడ లేదు .కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆదాయంతోనే కట్టుకున్నాంఇంత కష్టపడి రైతులతో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నది .నిల్వలు ఉన్నాయన్న పేరుతో మోడీ ప్రభుత్వం మొండిగా తిరస్కరిస్తున్నది
కరోనా విపత్తులో ఆహారం అందక అనేక మంది ప్రజలు ఆకలితో అలమటించారు .దేశంలో 22 కోట్ల మంది ప్రజలు ఆహారం లేక తండ్లాడుతున్నా కేంద్రం బియ్యం నిల్వలు పంచలేదుతెలంగాణ ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయడంతో యాసంగిలో 60 లక్షల ఎకరాలలో సాగయ్యే వరిని 35 లక్షల 80 వేల ఎకరాలకు పరిమితమయ్యారు తెలంగాణలో యాసంగి వరి ధాన్యం లో నూకలు ఎక్కువ వస్తాయి .కేంద్రం నిబంధనల ప్రకారం క్వింటాలు వడ్లకు 67 కిలోలు బియ్యం ఇవ్వాలి యాసంగిలో 67 కిలోలు రావు కాబట్టి బియ్యంతో సంబంధం లేకుండా వడ్లు కొనాలని కేంద్రాన్ని కోరాం .దానికి కూడా కేంద్రం నిరాకరిస్తున్నది ప్రజలకు నూకలు అలవాటు చేసుకోవాలి అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అహంకారపు వ్యాఖ్యలు చేశాడు.

ఈ దేశంలోని 28 రాష్ట్రాలలో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి .అంతటా అన్ని పంటలు పండవు తెలంగాణ , మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక కొంత భాగం, ఏపీలోనే అన్ని రకాల పంటలు పండుతాయి దేశంలోని వివిధ రాష్ట్రాలకన్నా తక్కువ పెట్టుబడితో తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది .ఇక్కడి ధాన్యం వినియోగించుకోవాలని కోరినా కేంద్రానికి సోయి లేదు త్యాగాలు దేశానివి .మోసాల ఫ్యాక్టరీ గుజరాత్ దేశాన్ని అమ్ముతున్నది గుజరాతీయులు .కొంటున్నది గుజరాతీయులు సాక్షాత్తు నరేంద్రమోడీ పచ్చి అబద్దాలు చెబుతాడు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు .కేంద్రంలో 14 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే ఎనిమిదేళ్లలో ఒక్క నోటిఫికేషన్ వేయలేదు ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టాడు దేశానికి అన్నం పెట్టే రైతు పండించిన పంటను కొనడానికి నిరాకరిస్తున్నాడుఎస్బీఐ బ్యాంకులో ప్రధాని మోడీ స్నేహితుడు అదానిని భాగస్వామిని చేసి రుణాలు ఇచ్చే పరిస్థితికి దిగజార్చారు పుల్ల పుల్ల ఏరి రైతులకు న్యాయం చేస్తుంటే .దేశాన్ని నాశనం చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది
ఢిల్లీలో తెలంగాణ వాణి వినిపించి దేశాన్ని జాగృతం చేసి కేంద్రానికి పాడె కట్టాలి త్యాగాలకోసం పుట్టింది తెలంగాణ .వ్యాపారం కోసం పుట్టింది గుజరాత్ రాజకీయ నేతలు మోడీ ప్రధాని అయినప్పుడు దేశం కోసం ఏదో చేస్తాడని అందరూ ఆశించారు కానీ ఆయన లక్షల విలువజేసే డ్రస్సులు రోజుకు ఐదు జతలు మారుస్తూ పేదమాటలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేశారు తెలంగాణ లో కేసీఆర్ ఇచ్చిన పథకాలు, పనుల గురించి మాట్లాడుతే ఒక రోజు సమయం పడుతుంది రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, వెయ్యి గురుకుల పాఠశాలలు, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి వంటి పథకాలున్నాయి ఎనిమిదేళ్లలో మోడీ పాలన వల్ల బాగుపడిన ఒక్క కుటుంబం దేశంలో లేదు ఈ దేశంలో, బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం నాలుగైదు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ఒక్క ప్రాజెక్టు మోడీ కట్టలేదు కానీ కేసీఆర్ ఏడేళ్లలో తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టులు కట్టారు
10, 12 మంది కార్పోరేట్ గద్దల కోసం ప్రజల డబ్బుును పణంగా పెట్టిన ఘనత మోడీ ప్రభుత్వానిది రూ.6 లక్షల కోట్లు ప్రజల డబ్బును ఊడ్చిపెట్టాడు నోట్ల రద్దుతో నల్ల డబ్బు బయటకు వస్తుందని , 58 రోజుల తర్వాత అద్భుతాలు జరుగుతాయని, ప్రజలను నమ్మించేందుకు కన్నతల్లిని బ్యాంకు ముందు లైన్లో నిలబెట్టిన మోసకారి మోడీ మోసాల కేంద్రాన్ని ఇంటికి సాగనంపాలి .ప్రతి ఇంటి మీద నల్లజెండాలు ఎగరేయండి తెలంగాణ గర్జన ఢిల్లీకి వినిపించాలి తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వనపర్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
.






