సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ సినిమా ‘జనగణమనపూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమా విజయ్ తో చేయబోతున్నట్టు ప్రకటించారు.ఈ సినిమా ప్రకటించారో లేదో సెట్స్ మీదకు తీసుకువెళ్లి ఫాస్ట్ గా పూర్తి చేయాలనీ పూరీ ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా కంటే ముందే వీరిద్దరి కాంబోలో లైగర్ సినిమా తెరకెక్కింది.బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ కాకుండానే జనగణమన స్టార్ట్ చేసారు.
ఇక ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ బుట్టబొమ్మ హీరోయిన్ గా నటిస్తుంది అని కన్ఫర్మ్ చేసారు.ఇప్పటికే ఈమె ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు.
ఇలా రెండు సినిమాలు చేస్తున్న మరొక సినిమా కూడా తెరకెక్కనుందని ఇటీవలే ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సెన్సేషనల్ క్రేజీ కాంబో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనే వార్త కన్ఫర్మ్ కాకుండానే ఇప్పుడు ఇది ఏ జోనర్ సినిమా అనే మరొక రూమర్ బయటకు వచ్చింది.
![Telugu Puri Jagannath, Janaganamana, Khushi, Liger, Pooja Hegde, Samantha, Vijay Telugu Puri Jagannath, Janaganamana, Khushi, Liger, Pooja Hegde, Samantha, Vijay]( https://telugustop.com/wp-content/uploads/2022/07/Janaganamana-Vijay-Devarakonda-JGM-r-puri-jagannath.jpg)
ఈ సినిమా కోసం పూరీ సోషియో ఫాంటసీ కథను రెడీ చేస్తున్నట్టుగా వార్త బయటకు వచ్చింది.ఈ కథకు విజయ్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు టాక్.తెలుగులో ఇలాంటి జోనర్ లో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్న వారు చాలా మందే ఉన్నారు.కానీ పూరీ మాత్రం ఇప్పటి వరకు ఇలాంటి జోనర్ టచ్ చేయలేదు.
దీంతో ఇదే నిజమైతే ఈయన సరికొత్త ప్రయోగం ఎలా వర్కౌట్ అవుతుంది చూడాలి.