టాలీవుడ్ స్టార్ హీరోలను హెచ్చరించిన హీరో ధనుష్.. జాగ్రత్త అంటూ కామెంట్స్?

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న వారిలో ధనుష్ ఒకరు.ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

 Hero Dhanush About Hollywood Offers To Prabhas And Ram Charan Details, Hero Dha-TeluguStop.com

అదే విధంగా ది గ్రే మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా పలు భాషలలో సినిమాలు చేస్తూ ఆగ్ర హీరోగా పేరు సంపాదించుకున్న ధనుష్ తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలకు పలు జాగ్రత్తలు సూచించారు.

ప్రభాస్ బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.అదేవిధంగా రామ్ చరణ్ RRR సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ ఉన్న ఈ హీరోలకు హాలీవుడ్ అవకాశాలు కూడా రావచ్చు.ఈ క్రమంలోనే హాలీవుడ్ సినిమాల అవకాశాలు వచ్చినప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలని హీరో ధనుష్ సూచించారట.

పెద్దపెద్ద హాలీవుడ్ సినిమాలలో ఆఫర్ వచ్చిన అంగీకరించకూడదు అంటూ ఈయన తెలిపారు.

Telugu Bahubali, Dhanush Grey, Dhanush, Prabhas, Ram Charan, Gray, Tollywood-Mov

హాలీవుడ్ చిత్రాలు ఆఫర్ వచ్చినప్పుడు మనకు గెస్ట్ రోల్ అని చెప్పి ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్ర ఇవ్వడం వల్ల మనకు ఉన్న స్టార్ డమ్ దెబ్బ తింటుందని, అయితే తాను అనుభవ పూర్వకంగా చెబుతున్నానని ధనుష్ వెల్లడించారు.ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో ఆయన పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని అలాగే స్క్రీన్ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉన్నట్లు మూవీ ప్రీమియర్ టాక్స్‌ను బట్టి తెలుస్తోంది.అందుకే ప్రభాస్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు అప్రమత్తంగా ఉండాలని ధనుష్ ఈ హీరోలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube