నల్లగొండ జిల్లా:గుర్తింపు లేని పదవి గుర్తు పట్టని ప్రజలు.పదవులిచ్చారు ప్రజలకు దూరం చేశారు.
ఆరువేల గౌరవ వేతనం కాదు,అభివృద్ధిలో భాగస్వామ్యం చేయండి.
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ కో-ఆప్షన్ మెంబర్లను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని పెద్దవూర మండల కో-ఆప్షన్ మెంబర్ షేక్ బషీర్ డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన పెద్దవూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేరుకే కో-ఆప్షన్ మెంబెర్ గా చలామణి అవుతున్నామని అభివృద్ధిలో మేము ఎవరమని ప్రశ్నించారు.పదవులు ఇచ్చి ప్రజలకు దూరంగా పెట్టారని,కో-ఆప్షన్ మెంబర్ అంటే మీరెవరని గ్రామాల్లో అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కో-ఆప్షన్ మెంబర్లకు ప్రత్యేకమైన హోదా లేదు,ఎలక్షన్స్ లో ఓటు హక్కు లేదు,ప్రజల్లో గుర్తింపు లేదని,మరి దేనికోసం ఉన్నామో అర్థం కావడంలేదని వాపోయారు.రాష్ట్రవ్యాప్తంగా 594 మంది కో-ఆప్షన్ మెంబర్లు ఉన్నామని,పేరుకే తప్పా, మమ్మల్ని గుర్తించేవారు లేరన్నారు.
నెలకు 6,500 రూపాయల జీతానికి పరిమితం చేసి,మా చేతులు కట్టేశారని,ఎవరికి చెప్పుకోవాలో తెలియక నానా రకాల అవమానాలు పడుతున్నామన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తమను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని,తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.