అమెరికా గన్ కల్చర్ ఆ దేశానికి అతి పెద్ద సమస్యగా మారిపోయింది.ఎంత మంది తుపాకుల తూటాలకు బలై పోయినా సరే అక్కడి చట్టాలు గన్ కల్చర్ కు వ్యతిరేకంగా పనిచేయలేని పరిస్థితి నెలకొంది.
అభం శుభం తెలియని చిన్నారులు 20 మంది బలై పోయినా, సాధారణ పౌరులు తూటాల ధాటికి నేలకొరిగినా సరే గన్ కల్చర్ పై ఎలాంటి ప్రభావం లేకపోవడం ఆదేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.తాజాగా మరో సారి విద్యార్ధులపై తూటాల వర్షం కురిసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
అమెరికాలోని మెక్సికో లోని వీధిలోకి తుపాకితో వచ్చిన ఓ దుండగుడు రోడ్డుపై తిరుగుతున్నా వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.ఊహించని ఘటనతో అందరూ భయాందోళనలకు లోనయ్యి పరుగులు పెట్టారు ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెడుతున్న సమయంలో తూటాల ధాటికి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
చనిపోయిన వారిలో ఐదు మంది విద్యార్ధులు కాగా, మరొకరు మహిళ ఉన్నారని స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనలో చనిపోయిన విద్యార్ధులు అందరూ 18 ఏళ్ళ లోపు వారని, అందరూ ఒకే కమ్యూనిటీ కి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
రెండు రోజల క్రితమే అమెరికాలోని సెలాయా ప్రాంతంలో ప్రతీకార దాడులు జరిగాయని ఈ తుపాకి దాడులలో సుమారు 11 మంది మృతి చెందగా వారిలో సుమారు ౮ మంది మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.ఇదిలాఉంటే అమెరికా వ్యాప్తంగా తుపాకి పేలుళ్ళ ఘటనలో రోజుకి సుమారు 5 నుంచీ 10 వరకూ జరుగుతున్నాయని ఎంతో మంది అమాయకపు ప్రజలు ఈ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని గన్ కల్చర్ వ్యతిరేక సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కాగా బిడెన్ ప్రభుత్వం ప్రస్తుతం గన్ కల్చర్ కి వ్యతిరేకంగా చట్టాలని తీసుకురావాలని అనుకున్నా కొన్ని రాష్ట్రాలు మాత్రం అందుకు సహకరించడం లేదని ఈ రాష్ట్రాలు రిపబ్లికన్ పార్టీ నేతలు పాలిస్తున్నవిగా స్థానిక మీడియా వెల్లడించింది.