ఒకప్పుడు షాపింగ్ అంటే ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.నేరుగా షాపుల దగ్గరకు వెళ్లి కొనుగోలు చేయాల్సిందే.
ఐదు లేదా 10 షాపులు తిరిగితే కానీ మనకు నచ్చిన వస్తువు దొరికేది కాదు.అప్పట్లో షాపింగ్ చేయాలంటే గంటల సమయం పెట్టేది.
పొద్దున బయటకు వెళితే మధ్యాహ్నం వరకు పట్టేది.ఇక పెళ్లి షాపింగ్ అయితే రెండు, మూడు రోజులు ఈజీగా పట్టేది.
ఇక షాపింగ్ మాల్స్ వచ్చిన తర్వాత ఒకచోటకు వెళితే మనకు కావాల్సినవన్ని దొరకుతున్నాయి.
అయితే టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో అన్నీ ఆన్ లైన్ అయ్యాయి.
బయటకు వెళ్లకుండానే మన ఇంటికే నేరుగా వచ్చేస్తున్నాయి.ఈ కామర్స్ రంగం బాగా విస్తరించిన నేపథ్యంలో ఏది కావాలన్నా.
ఆన్ లైన్ లో దొరికేస్తుంది.ఆర్డర్ పెట్టగానే నిమిషాల్లో డోర్ డెలివరీ చేస్తున్నాయి ఈ కామర్స్ సంస్థలు.
ఇక కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ కామర్స్ రంగం మరింత విస్తరించింది.అనేక కంపెనీలు కొత్తగా పుట్టుకొచ్చాయి.
టూత్ పేస్ట్ దగ్గర నుంచి వెజిటెబుల్స్, బట్టలు, ఎలక్ట్రానిక్స్… ఇలా ప్రతీ వస్తువు ఆన్ లైన్ లో లభిస్తుంది.ఆర్డర్ చేయగానే నేరుగా ఇంటికే వచ్చేస్తుంది.
అయితే ఇందులో కూడా మోసాలు జరుగుతున్నాయి.మనం బుక్ చేసుకున్నది ఒక్కటైతే వేరేవి పంపిస్తున్నారు.

ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.తాజాగా ఓ యువకుడు ఆన్ లైన్ లో సెల్ ఫోన్ ఆర్డర్ చేయగా.సబ్బు వచ్చింది.ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో చోటుచేసుకుంది.బోయవాడకు చెందిన పందిరి భీమన్న అనే యువకుడు ఐదు రోజుల క్రితం ఓ ఈ కామర్స్ వెబ్ సైట్ లో సెల్ ఫోన్ బుక్ చేశాడు.డెలివరీ రాగానే పార్శిల్ ఓపెన్ చేసి చూడగా.
అందులో రిన్ సబ్బు ఉంది.దీంతో అతడు ఈ కామర్స్ వెబ్ సైట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అతని ఫిర్యాదుతో ఈ కామర్స్ వెబ్ సైట్ పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.