ఆ థియేటర్ లో అఖండ 175 డేస్..!

నందమూరి నట సింహం బాలకృష్ణ, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అఖండ.సింహా, లెజెండ్ సినిమాలని మించి అఖండ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.బాలయ్య మార్క్ మాస్ అంశాలతో బాక్సాఫీస్ షేక్ చేశారు.సినిమా 50 రోజులు, 100 రోజులు పూర్తి చేసుకుంది.లేటెస్ట్ గా సినిమా 175 రోజులు పూర్తి చేసుకుంది.చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో అఖండ సినిమా 175 రోజులు పూర్తి చేసుకుంది.

 Akhanda 175 Days Completed In That Theator Akhanda , 175 Days, Boyapati, Bala Kr-TeluguStop.com

బాలయ్య సినిమాలు ఎవర్ గ్రీన్ రికార్డులు కొడుతూనే ఉంటాయి.లెజెండ్ సినిమాని ఏకంగా 500 రోజులు ఆడించిన విషయం తెలిసిందే.

అఖండ సినిమా రామకృష్ణ థియేటర్ లో 175 డేస్ పూర్తి చేసుకుంది.అయితే ఈ సందర్భంగా చిత్రయూనిట్ తో ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట.ఈ స్పెషల్ పార్టీకి బాలకృష్ణ కూడా అటెండ్ అవుతారని తెలుస్తుంది.అఖండ సినిమాకు థమన్ మ్యూజిక్ స్పెషల్ హైలెట్ గా నిలిచింది.

సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించింది.బాలయ్య డబుల్ యాక్షన్ మాస్ ఆడియెన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చింది.

 ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా కూడా తన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇస్తుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube