సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే అభిప్రాయం చాలామందిలో ఉంది.పలువురు నటీమణులు సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందని చెబితే మరి కొందరు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర రంగాలలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పుకొచ్చారు.
మరి కొందరు హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్నా తమకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని వెల్లడించడం గమనార్హం.తాజాగా సీనియర్ నటి రాధా ప్రశాంతి కాస్టింగ్ కౌచ్ పై కామెంట్లు చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధా ప్రశాంతి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్నది గతంలో ఉందని ఇప్పుడు కూడా ఉందని వెల్లడించారు.రాబోయే రోజుల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని అయితే గతంలో కాస్టింగ్ కౌచ్ ఎదురైనా ఎవరూ పబ్లిసిటీ చేసుకోలేదని రాధా ప్రశాంతి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ గురించి రోడ్డుమీదకు ఎక్కారని ఆమె అభిప్రాయపడ్డారు.అప్పటికీ ఇప్పటికీ ఇది మాత్రమే డిఫరెన్స్ అని ఆమె కామెంట్లు చేశారు.
![Telugu Manager, Radha Prashanti, Tollywood-Movie Telugu Manager, Radha Prashanti, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/05/radha-prashanti-tollywood.jpg)
సినిమా రంగంలో ఎవరూ ఎవరిని బలవంతం చేయరని అయితే సినిమాలో హీరోయిన్ గా ఎంపిక కావాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాలనే పాలసీ ఇండస్ట్రీలో ఉందని రాధా ప్రశాంతి అభిప్రాయపడ్డారు.తనకు కూడా ఈ తరహా పరిస్థితులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు.ఒక సినిమాలో నన్ను సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసి ఆ తర్వాత తొలగించారని ఆమె చెప్పుకొచ్చారు.తనను ఎందుకు తొలగించారని మేనేజర్ ను అడిగానని ఆమె అన్నారు.
ఆ సమయంలో మేనేజర్ తనకు బదులుగా కమిట్‌మెంట్ ఇచ్చిన వారిని సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారని ఆమె చెప్పుకొచ్చారు.అప్పుడు ఇప్పుడు కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని రాధా ప్రశాంతి కామెంట్లు చేశారు.
రాధా ప్రశాంతి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.