ఇప్పటి వరకు లైన్లలో నిల్చుని, నడుం నొప్పులు-కాళ్ల నొప్పులతో మందుబాబులు లిక్కర్ షాపుల వద్ద క్యూలలో కనిపించడం చూసి ఉంటాం.ఇందు కోసం పనులు మానుకుని మరీ చాలా మంది క్యూలలో ఉంటారు.
మందు చుక్క గొంతు తడవగానే ఉపశమనంగా ఫీల్ అవుతుంటారు.ముఖ్యంగా బీర్ల కోసం యువత లిక్కర్ షాపులకు పరుగులు పెడుతుంటారు.
మనం ఇప్పటి వరకు అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి ఇంటికే రప్పించుకుంటున్నా, మద్యానికి మాత్రం దేశంలో హోం డెలివరీ విధానం లేదు.అయితే ఈ విషయంలో మందుబాబులకు ఢిల్లీ సర్కారు గుడ్ న్యూస్ అందించింది.
త్వరలోనే లిక్కర్‌ను ఇంటికే అందించనుంది.
మద్యం హోమ్ డెలివరీపై 17 పేజీల క్యాబినెట్ నోట్‌కు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కూడిన మంత్రుల బృందం ఆమోదం తెలిపింది.
దీంతో ఢిల్లీలో మందు కావాలనుకునే వారికి ఇంటికే సర్వీస్ చేయనున్నారు.మద్యం హోమ్ డెలివరీ ప్రతిపాదనను ఢిల్లీ కేబినెట్ ఆమోదం కోసం ఉంచనున్నారు.అక్కడ ఆమోదం లభించడం లాంఛనమే.ఇటీవల, ఢిల్లీ ప్రభుత్వం రిటైల్ షాపుల వెలుపల రద్దీని, కొన్ని అవాంఛనీయ ఘటనలు జరగడాన్ని గమనించింది.
దీంతో మద్యంపై 25 శాతం డిస్కౌంట్ అమలుకు నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే కోవిడ్ కేసులు అక్కడ ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి.
ప్రజలు మద్యం షాపుల వద్ద గుంపులుగా ఉంటుండడంతో మద్యాన్ని హోమ్ డెలివరీ చేయడమే సరైన ప్రత్యామ్నాయం అని ఢిల్లీ సర్కారు భావించింది.మద్యం హోమ్ డెలివరీ కోసం కొన్ని లిస్టెడ్ కంపెనీలను ఎంపిక చేసి, వాటి ద్వారా పంపిణీ చేయాలని అనుకుంటోంది.
లిక్కర్ డెలివరీ చేయడానికి ఇతర దేశాలు అనుసరించిన విధానాలనే ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేయడానికి ముందు అధ్యయనం చేస్తారు.ఆ తర్వాత మద్యం హోం డెలివరీకి ఉత్తర్వులు వెలువడనున్నాయి.
కోవిడ్ అన్‌లాకింగ్ సమయంలో మద్యం వ్యాపారాన్ని నియంత్రించే ఎక్సైజ్ నిబంధనలను సవరించారు.గతేడాది ఢిల్లీ ప్రభుత్వం మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా మద్యం హోమ్ డెలివరీని అనుమతించింది.