గూగుల్ ప్లే స్టోర్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్‌కు మంగళం.. నేటి నుంచే అమలు!

యూజర్ల భద్రత, గోప్యతను మెరుగుపరిచే చర్యలలో భాగంగా థర్డ్ పార్టీ యాప్‌లు ఏపీఐ(అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) ఉపయోగించకుండా నిరోధించడానికి గూగుల్ ప్లే స్టోర్ కొత్త విధానాలను అమలు చేస్తోంది.ఇక నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో కాల్ రికార్డింగ్ కోసం వినియోగించే థర్డ్ పార్టీ యాప్‌లు ఇక పని చేయవు.

 Call Recording Apps On Google Play Store Tuesday Run From Today , Google Play,-TeluguStop.com

అయితే ఇప్పటికే ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గా ఉన్న యాప్‌లు మాత్రం యథాతథంగా పని చేస్తాయి.మే 11 నుంచే కాల్ రికార్డింగ్ యాప్స్‌ను నిషేధిస్తూ గూగుల్ గతంలో నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం నేటి (బుధవారం) నుంచే అమలు కానున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కాల్ రికార్డింగ్ చట్టాలు మారుతూ ఉంటాయి.

అయితే ఫోన్లలో ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు మార్పు వల్ల ప్రభావితం కావు.వినియోగదారుల గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని, వివిధ దేశాలలో వివిధ కాల్ రికార్డింగ్ చట్టాలు పటిష్టం చేస్తున్నారు.

ఇంతకుముందు యాపిల్ ఐఫోన్ తన యూజర్లకు ఇతర కాల్ రికార్డింగ్ యాప్‌లను వినియోగించడానికి అనుమతించలేదు.ఆండ్రాయిడ్‌ ఫోన్లలో సైతం కాల్ రికార్డింగ్‌ను నిలిపివేయాలని గూగుల్ కొంతకాలంగా భావిస్తోంది.

ఆండ్రాయిడ్ 6లో ఈ కాల్ రికార్డింగ్ యాప్‌లను అడ్డుకుంది.కొన్ని యాప్‌లు ఆండ్రాయిడ్ 10 మరియు అంతకంటే ఎక్కువ వెర్షన్‌లలో నడుస్తున్న డివైజ్‌లలో కాల్ రికార్డింగ్ ఫంక్షనాలిటీని అందించడానికి ఉపయోగపడే యాక్సెస్ అందిపుచ్చుకోవడానికి ఆండ్రాయిడ్‌లో లొసుగును కనుగొన్నారు.

ఏపీఐ యాక్సెస్ లేకుండా థర్డ్ పార్టీ యాప్‌లు కాల్ రికార్డింగ్‌ను సదుపాయాన్ని అందించలేవు.ఇది ఐఫోన్ మాదిరిగానే ఉంటుంది.

కాల్ రికార్డింగ్ యాప్స్‌ వల్ల వినియోగదారుల డేటాకు ముప్పు ఏర్పడుతుందని, ఆ కారణంగానే ఈ చర్య చేపట్టినట్లు గూగుల్ వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube