మంత్రి పువ్వాడ అజయ్ పై జాతీయ ఎస్సి కమిషన్ లో పిర్యాదు చేసినట్లు హెడ్యూల్ కులాల మహిళలు ఓ ప్రకటన లో తెలిపారు.ఖమ్మం నగరంలోని మమతా మెడికల్ & డెంటల్ కాలేజీ లోనీ ఎస్సి, ఎస్టీ, పీజీ విద్యార్థులకు కేంద్రం నుంచీ వస్తున్న స్కాలర్ షిప్ లను విద్యార్థుల కు అందకుండా చేస్తూ బలవంతంగా విత్ డ్రా పామ్స్ మీద సంతకాలు పెట్టించుకుంటు, చెప్పింది వినకపోతే ఫెయిల్ చేస్తామంటూ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరుస్తున్నారాని ఆరోపించారు.
ఇదే అంశంపై మమత మెడికల్ కాలేజీ యాజమాన్యం అయిన మంత్రి పువ్వాడ అజయ్ పై జాతీయ ఎస్సి కమిషన్ లో పిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
మా బిడ్డల నోటి కాడా కుడు లాక్కోవాలని చూస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ ఇంటిని ముట్టడిస్తాం అని, మంత్రి పదవి ఉడగొట్టేవరకు వదిలిపెట్టం అని హెచ్చరించారు.