25 కోట్లకు అమ్ముడైన వరుణ్ తేజ్ 'గని' సినిమా అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని.అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.

 Varun Tej Gani Movie Sold For 25 Crores Ott In All Languages, Satellite Rights-TeluguStop.com

సిద్దు ముద్ద, అల్లు బాబీ ఈ సినిమాకు నిర్మాతలు.ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ పై మంచి స్పందన వస్తోంది.ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది.

ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్.తాజాగా ఈ సినిమా అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయి.

కేవలం ట్రైలర్ మాత్రమే చూసి ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది.సినిమాను అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.

సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube