2022 ఆస్కార్ అవార్డు ఈవెంట్ లో చోటు చేసుకున్న సంఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఈవెంట్ లో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, కమెడియన్ క్రిస్ రాక్ తన భార్య ఆరోగ్యం గురించి మాట్లాడుతూ హాస్యం చేయడంతో అతని చెంప పగల గొట్టాడు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సంఘటనకు సంబంధించిన విషయం గురించి చర్చించుకుంటున్నారు.ఇదే విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ సంఘటనపై బాలీవుడ్ బ్యూటీ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ స్పందిస్తూ ఆ పరిస్థితుల్లో ఉంటే తాను కూడా అదే విధంగా చేసేదాన్ని అంటూ విల్ స్మిత్ కి మద్దతుగా నిలిచింది.ఇక ఇదే విషయం పై మరొక సెలబ్రిటీ అయిన హీరోయిన్ సమీరా రెడ్డి స్పందించింది.
ఈ సందర్భంగా సమీరారెడ్డి మాట్లాడుతూ.గతంలో ఆమె కూడా అలోపేసియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
అనంతరం ఆ వ్యాధి అంటే ఏంటో కూడా తెలిపింది.ప్రతి ఒక్కరు కూడా వారి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
ఇదే విషయంపై ఇటీవల ఆస్కార్ ఈవెంట్ లో భాగంగా జరిగిన సంఘటన నన్ను మాట్లాడేలా చేసింది.ఇక అలోపేసియా వ్యాధి అంటే అది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి.దీనివల్ల జుట్టు కుదుళ్ల నుంచి ప్యాచ్ లుగా ఊడిపోతుంది.ఈ విధంగా 2016లో ఈ వ్యాధితో నేను కూడా బాధపడ్డాను.ఒకరోజు నా భర్త నా తల వెనుక భాగంలో 2 ఇంచుల మీద ఓడిపోయి ఉండటాన్ని గమనించాడు.అలా ఒకటి రెండు నెలల్లోనే రెండు మూడు ప్రదేశాలలో నా జుట్టు ఊడిపోయి కనిపించింది అని చెప్పుకొచ్చింది సమీరారెడ్డి.
అయితే అలోపేసియా వ్యాధి కాదు, అంతేకాకుండా అది మనల్ని ఆరోగ్యానికి కూడా గురి చేయదు కానీ జుట్టు రాలిపోవడం అంటే మానసికంగా కుంగదీస్తుంది అని తెలిపింది.కానీ సమస్య ఎందుకు వస్తుంది అనేది కచ్చితంగా తెలియదు కానీ ఇది పెద్ద సమస్య వ్యాధి అయితే కాదు అంటూ సమీరా చెప్పుకొచ్చింది.
అయితే అలోపేసియా సమస్యతో తాను కూడా మానసికంగా కుంగిపోయిన తెలిపింది.