భారతీయ ఉద్యోగులకు జీతాలు భారీగా పెరగనున్నాయని ఇప్పటికే పలు దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ప్రముఖ గ్లోబల్ ప్రొఫెషనల్ సంస్థ కు చెందిన అయాన్ సర్వే తాజాగా తన రిపోర్టులో వెల్లడించింది.కేవలం ఇతర దేశాల్లో మాత్రమే కాకుండా భారతదేశంలో కూడా ఉద్యోగులకు భారీ వేతనాలు త్వరలో రాబోతున్నాయని ప్రకటించింది.అంతేకాదు రానున్న ఐదేళ్లలో ఇతర దేశాల లో ఉండే ఉద్యోగుల కంటే కూడా భారతీయులకు భారీ జీతభత్యాలు ఇవ్వనున్నాయట ఆయా దేశాల కంపెనీలు.
2022 ఏడాది నుంచి భారతదేశంలో ఉండే ఉద్యోగుల జీతాలు ఐదేళ్లలో 9.9 శాతానికి చేరుకుంటాయని ఈ మార్పు భారతీయ ఉద్యోగుల జీవితాలలో సంతోషాన్ని నింపనుందని అయాన్ సర్వే వెల్లడించింది.గత ఏడాది అంటే 2021 లో 9.3 శాతం ఉన్న జీతాలు 2022 నాటికి 9.9 శాతానికి పెరుగుతాయని తెలిపింది.సుమారు 40 పైగా సంస్థలకు చెందిన 1500 కంపెనీలను విశ్లేషించిన అయాన్ సర్వే జీతాల పెరుగుదల తప్పకుండా ఉంటుందని వెల్లడించింది.ఇదిలాఉంటే.
ఐటీ, లైఫ్ సైన్స్, ఈ కామర్స్ రంగాలలో ఈ జీతాల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుందని బ్రిక్స్ దేశాలైన ఇండియా, బ్రెజిల్, రష్యా, చైనా, లలో ఈ జీతాలు భారీగా పెరగనున్నాయట.బ్రిక్స్ దేశాలలో చైనా , రష్యా లకంటే కూడా భారత్ కు చెందిన ఉద్యోగులకు భారీ డిమాండ్ ఉందని సర్వే ప్రకటించింది.