తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలతో హాట్ హాట్ గా మారుతున్నాయి.అయితే ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు ఉన్నా ఇప్పటి నుండే ఎన్నికల వాతావరణం నెలకొంది.
అయితే తాజాగా జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ ఆ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సమావేశాల్లో బీజేపీపై ఒంటి కాలిపై కేసీఆర్ లేచిన విషయం తెలిసిందే.అయితే ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు.
అయితే ఇక వచ్చే ఎన్నికల్లో దేశ రాజ కీయాలలో కూడా కీలక పాత్ర పోషిస్తానని ఇది వరకే కేసీఆర్ ప్రకటించడంతో ఇప్పటి నుండే ఆ దిశగా ముందుకు కదులుతున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే బీజేపీని టార్గెట్ చేయడం ద్వారా ఇటు దేశ వ్యాప్తంగా దృష్టి పడటంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున రాజకీయ రణరంగం అనేది మొదలైంది.
అయితే ఇప్పటికే గత ఎన్నికల కంటే మెరుగైన స్థానాలు బీజేపీకి వస్తాయని పలు సర్వేలలో వెళ్లడవడంతో ఇక బీజేపీ మరింతగా ముందుకెళ్లవద్దనే ఉద్దేశ్యంతో ఈ తరహా ప్రచారాన్ని కెసీఆర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం కెసీఆర్ ఇక త్వరలో నియోజకవర్గాల పర్యటనకు కెసీఆర్ వెళ్లనున్న నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో ఇక రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా మారే అవకాశం ఉంది.
అయితే బీజేపీపై యుద్దం ప్రకటించడంలో ఉన్న వ్యూహం ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల దృష్టి పడకుండా చేసే వ్యూహంలో భాగంగానే బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.