టాలీవుడ్ లోని క్యూట్ కపుల్స్ లో మహేష్ బాబు నమ్రత జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత నమ్రతా శిరోద్కర్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.
మహేష్, నమ్రత కలిసి సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నా నమ్రత శిరోద్కర్ నటనకు పూర్తిగా దూరమైనట్టేనని సమాచారం అందుతోంది.వంశీ సినిమా వల్ల మహేష్, నమ్రత ప్రేమలో పడ్డారనే సంగతి తెలిసిందే.
స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.17 సంవత్సరాలుగా మహేష్, నమ్రత అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు.ఎంతో మంది సెలబ్రిటీ జోడీల మధ్య గొడవలు జరుగుతూ వాళ్లు విడిపోతున్నా మహేష్, నమ్రతల గురించి అలాంటి వార్తలు కూడా ప్రచారంలోకి రాలేదు.మహేష్ నటించే సినిమాల విషయంలో కూడా నమ్రత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే మహేష్, నమ్రతలలో ఎవరు ముందుగా లవ్ ప్రపోజ్ చేశారనే ప్రశ్న ఒక సందర్భంలో నమ్రతకు ఎదురు కాగా నమ్రత ఆ ప్రశ్న గురించి స్పందిస్తూ న్యూజిలాండ్ లో తమ మధ్య ప్రేమ మొదలైందని అయితే ఎవరు లవ్ ప్రపోజ్ చేశారంటే మాత్రం అది మాకే కన్ఫ్యూజన్ అని ఆమె చెప్పుకొచ్చారు.మహేష్, నమ్రత ఒకరిపై ఒకరు తమకు తెలియకుండానే ప్రేమను వ్యక్తపరచుకున్నామని చెప్పకనే చెప్పేశారు.
మహేష్, నమ్రత కలకాలం సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.వయస్సులో మహేష్ బాబు కంటే నమ్రత పెద్ద అనే సంగతి తెలిసిందే.17 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 10వ తేదీన మహేష్ బాబు నమ్రతల వివాహం జరిగింది.మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.