టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలయ్య మనస్సులో ఏదీ దాచుకోరు.అభిమానులపై ప్రేమనైనా కోపాన్నైనా వ్యక్తపరిచే విషయంలో బాలయ్య రూటే సపరేట్ అనే సంగతి తెలిసిందే.
ఒక దశలో వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులు పడిన బాలయ్య దర్శకుల ఎంపికలో, కథల ఎంపికలో మార్పును చూపిస్తూ విజయాలను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకు బాలయ్య హోస్టింగ్ ప్లస్ అయింది.
బాలయ్య సెలబ్రిటీల సీక్రెట్లను చెప్పించడంతో పాటు తన సీక్రెట్లను కూడా బయటపెడుతూ అన్ స్టాపబుల్ షోను చూస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ఇతర టాక్ షోలను మించిన సక్సెస్ ఫుల్ టాక్ షోగా అన్ స్టాపబుల్ షో నిలవడం గమనార్హం.
బాలయ్య హోస్టింగ్ కు ఆయన అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.గత నెల 31వ తేదీ నుంచి రవితేజ, గోపీచంద్ మలినేని గెస్టులుగా హాజరైన అన్ స్టాపబుల్ షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే బాలయ్య గురించి గతంలో కొన్ని ఫేక్ వార్తలు వైరల్ అయ్యాయి.కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వ్యూస్ కోసం బాలయ్యకు పలువురు హీరోలతో గొడవలు ఉన్నాయనే విధంగా వార్తలను వైరల్ చేశాయి.
అయితే అలా వైరల్ అయిన వార్తల గురించి అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ఘాటుగా స్పందించారు.నాకు రవితేజకు పడదని చిరంజీవి బాలయ్య మాట్లాడుకోరని నా హీరో తోపు నీ హీరో సోపు అంటూ కొంతమంది పేరు, లొకేషన్ లేని అడ్రస్ లతో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని బాలయ్య అన్నారు.
సర్జరీ చేయించుకున్న ఎడమ చెయ్యి కూడా రెడీ అయిందని దొరికితే దవడ పగిలిపోతుందని బాలయ్య పేర్కొన్నారు.ఆ తర్వాత కూల్ అయిన బాలయ్య మనమంతా ఒకటే చేయాలని పేరు, ప్రాంతం చెప్పుకోలేని వెధవలను క్షమించాలని బాలయ్య అన్నారు.మనపై వచ్చే విమర్శలను కూడా ప్రేమిద్దామని బాలయ్య వెల్లడించారు.