మళ్లీరావా, దేవదాస్ సినిమాలతో పరంపర వెబ్ సిరీస్ ద్వారా ఇండస్ట్రీలో ఆకాంక్ష సింగ్ గుర్తింపును సంపాదించుకున్నారు.తనకు వరుసగా అవకాశాలు వస్తున్నాయని అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల సినిమాల రిలీజ్ మాత్రం ఆలస్యమవుతోందని ఆకాంక్ష తెలిపారు.
తను నటించిన సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయని ఆకాంక్ష సింగ్ చెప్పుకొచ్చారు.పరంపర వెబ్ సిరీస్ లో మహిళలకు స్పూర్తినిచ్చే పాత్రలో తాను నటించానని ఆమె అన్నారు.
నవీన్ చంద్ర అద్భుతమైన నటుడు అని పరంపర వెబ్ సిరీస్ లో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందని ఆకాంక్ష సింగ్ వెల్లడించారు.నటికి ఎమోషన్ పండించడమే బాధ్యత అని చెప్పాలనుకునే విషయాలను హావభావాలతో చెప్పడానికి భాష అవసరం లేదని ఆకాంక్ష చెప్పుకొచ్చారు.
తనలో త్వరగా గ్రహించే లక్షణం ఉండటంతో ఏదీ కష్టంగా అనిపించదని ఆమె కామెంట్లు చేశారు.
బాల్యం నుంచే నటన అంటే ఇష్టమని కొత్త పాత్రలో నటించాలనే ఆలోచనతో సినిమాల్లోకి వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.
సీరియళ్లలో ఒకే పాత్రలో సంవత్సరాల పాటు నటించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.భవిష్యత్తులో బుల్లితెరపై కనిపిస్తానో లేదో అని ఆకాంక్ష చెప్పుకొచ్చారు.నటులకు కంఫర్ట్ జోన్ ఉండదని ఎంచుకున్న పాత్రలకు న్యాయం చేస్తామా? ప్రేక్షకులను మెప్పిస్తామా? అని మాత్రమే ఆలోచిస్తామని ఆకాంక్ష సింగ్ వెల్లడించారు.
యువరాణి రోల్, బయోపిక్స్ తనకు డ్రీమ్ రోల్స్ అని ఆకాంక్ష సింగ్ అన్నారు.తనకు భర్త కునాల్ సపోర్ట్ ఉందని ఆమె తెలిపారు.తాను, కునాల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఒకరిపై మరొకరికి ఆరాధనా భావం ఉండేదని ఆమె అన్నారు.
కొన్నిరోజుల తర్వాత ప్రేమ విషయం ఫ్యామిలీ మెంబర్స్ కు చెప్పి పెళ్లి చేసుకున్నానని ఆకాంక్ష చెప్పుకొచ్చారు.తెలుగులో చాలామంది నటులు తనకు ఇష్టమని ప్రత్యేకంగా ఒకరి పేరును తాను చెప్పలేనని ఆమె చెప్పుకొచ్చారు.