కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కు ఖరీదైన బహుమతులు ఇచ్చిన బాలీవుడ్ స్టార్స్.. ఎవరంటే?

బాలీవుడ్ జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబర్ 9న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ పోర్ట్ బర్వారాలో మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.పెళ్లి తర్వాత ఈ జంట వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలను విడివిడిగా వారివారి ఇంస్టాగ్రామ్ ఖాతాలో తమ అభిమానులతో పంచుకున్నారు.

 Katrina Kaif Vicky Kaushal Gets Expensive Gifts From Bollywood Celebrities Detai-TeluguStop.com

ఈ జంట పెళ్లికి బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు, సన్నిహితులు ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.ఇదిలా ఉంటే పెళ్లికి వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్ గా ఒక స్వీట్ బాక్స్ తో పాటు లెటర్ ను కూడా గిఫ్ట్ బాక్స్ లో ఇచ్చారు.

ఇది ఇలా ఉంటే బాలీవుడ్ లో పలువురు ప్రముఖులను, సెలబ్రిటీలను వీరి పెళ్లికి ఆహ్వానించలేదు అన్న విషయం తెలిసిందే.

దీనితో పెళ్లికి హాజరు కానీ సెలబ్రిటీలకు తాజాగా ఈ జంట నేతితో చేసిన లడ్డూలను, అలాగే ఒక లెటర్లను గిఫ్ట్ ప్యాక్ చేసి పంపించారు.

ఇకపోతే వీరి పెళ్లికి వచ్చిన ఆ బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన బహుమతులతో సర్ ప్రైజ్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఏ సెలబ్రిటీలు ఏ బహుమతి ఇచ్చారు ఇప్పుడు తెలుసుకుందాం.ఇందులో మొదటగా విక్కీ కౌశల్ గురించి మాట్లాడుకుంటే విక్కీ కౌశల్ తన భార్యకు 1.3 కోట్లు విలువ చేసే డైమండ్ రింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట.

Telugu Alia Bhatt, Bollywood, Expensive Gifts, Katrina Kaif, Ranbir Kapoor, Salm

ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి అనేక సినిమాల్లో నటించారు అన్న విషయం తెలిసిందే.ఇక సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ కి 3 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.అలాగే బాలీవుడ్ హీరో రణ బీర్ కపూర్ తో కత్రినా కొద్ది కాలం పాటు డేటింగ్ చేసిన విషయం తెలిసిందే.విడిపోయిన కూడా వీరు మిత్రులుగా కొనసాగుతూనే ఉన్నారు.ఇకపోతే రణ బీర్ కపూర్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కి 2.7 కోట్ల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.అలాగే బాలీవుడ్ నటి అందాల తార ఆలియా భట్ కత్రినాకైఫ్ కి పర్ఫ్యూమ్ బాస్కెట్ ను ఇచ్చినట్టు తెలుస్తోంది.

Telugu Alia Bhatt, Bollywood, Expensive Gifts, Katrina Kaif, Ranbir Kapoor, Salm

దాని విలువ దాదాపుగా లక్షల్లోనే ఉంటుంది అని సమాచారం.బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ 1.5 లక్షల విలువ చేసే ఖరీదైన పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే హృతిక్ రోషన్ బీఎండబ్ల్యూ జీ -310 ఆర్ బైక్ ను గిఫ్ట్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే విక్కీ కౌశల్, హీరోయిన్ తాప్సీ కలిసి గతంలో పలు సినిమాల్లో నటించారు.విక్కీ కి, తాప్సి 1.4 లక్షలు విలువ చేసే ప్లాటినం బ్రాస్ లేట్ ను గిఫ్ట్ గా ఇచ్చిందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube