వామ్మో.. 6400 ఫుడ్ ఐటమ్స్ ను ఒకే మహిళ నాలుగు గంటల్లోనే చేసిందిలా..!

మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు.ఓ మహిళ ఒక హోటల్ లో పనిచేస్తోంది.

 Wow Woman Made 6400 Food Items In Just Four Hours, 6400 ,food Items, Women Story-TeluguStop.com

అమెరికాలోని జార్జియాలో పెర్రీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి మెక్‌డొనాల్డ్ హోట‌ల్‌ లో ఆ మహిళ పనిచేస్తోంది.ఆమె పేరు బ్రిట్టానీ కుర్టీస్‌.

ఈ మహిళ కేవలం నాలుగు గంటల్లోనే 6400 ఫుడ్ ఐట‌మ్స్ ను వండేసింది.ఆ ఫుడ్ ను ఆర్డర్ చేసిన వారికి డెలివరీ చేసేసింది.

ఇది అంత సులువుగా చెప్పే విషయం కాదు.ఆమె వండిన వంటల్లో 1600 మైక్ చికెన్‌ శాండ్‌ విచ్‌లు ఉన్నాయి.

అదేవిధంగా 1600 మైక్ డ‌బుల్స్‌, 3200 చాక్లెట్ చిప్ కుకీస్ లు ఉండటం విశేషం.నాలుగు గంట‌ల సమయంలోనే ఇంత భారీగా వచ్చిన ఆర్డర్లను వండి బాక్సుల్లో ప్యాక్ చేసి పంపడం నిజంగా గ్రేట్.

ఆర్డ‌ర్ ప్ర‌కారంగా వంట‌లు వండి పెట్టి కేవలం నాలుగు గంట‌ల్లోనే ఆమె ఆ వంటల్నీ డెలివ‌రీకి పంపింది.

ప్రస్తుతం ఆమె అలా చేసిన సందర్బాన్ని వీడియోను తీసి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది.

దీంతో అది కాస్తా వైరల్ అయ్యింది.ఆమె వండిన వంటల ఆర్డ‌ర్ బిల్లు చూస్తే సుమారుగా 7400 డాల‌ర్లుగా ఉంది.ఈ వీడియోను చూసి చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఓ యూజర్ కామెంట్ చేస్తూ రియాక్ట్ అయ్యాడు.1200 మంది పిల్లలకు భోజనం అలా వండి పెట్టడం నిజంగా బాధాకరం అని ఒకరంటే.

Telugu Hours, Items, America, Britanny Kurdis, Georgia, Mcdonalds, Story-Latest

ఆమె చాలా ఒత్తిడితో అలా వండినట్లైతే అవి సరిగా ఉండేవా కావోనని సందేహంగా ఉంది అని తెలిపారు.వెంటనే కామెంట్స్ బాక్స్‌లోనే బ్రిట్టానీ కుర్గీస్ రియాక్ట్ అయ్యారు.అది రెగ్యులర్ గా వచ్చే ఆర్డర్ అని, ఆ క‌స్ట‌మ‌ర్ స్థానిక జైలు ఉద్యోగి అని తెలిపింది.

అయితే తాను వండిన భోజనం ఖైదీల‌కా, జైలు ఉద్యోగులుగా అన్నది తెలీదన్నారు.తాను మాత్రం చాలా శ్రద్దగా వండానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube