అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.డిసెంబర్ లో సినిమా ను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
మొదటి నుండి ఈ సినిమా ను పాన్ ఇండియా మూవీ అంటూ యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.పాటలు కూడా ఇప్పటికే అయిదు భాషల్లో విడుదల చేయడం జరిగింది.
మూడు పాటలు కూడా హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదల చేసిన తర్వాత ఇప్పుడు కొందరు బాలీవుడ్ లో అంటే హిందీ లో ఈ సినిమా ను విడుదల చేసేందుకు పుష్ప ప్లాన్ చేసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.హిందీ లో ఈ సినిమాను విడుదల చేయకుండా ఉండాలని భావిస్తున్నట్లుగా మీడియాలో జరుగుతున్న ప్రచారంకు పుష్ప యూనిట్ సభ్యులు అనధికారికంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.
పుష్ప సినిమా ను భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్ లో డిసెంబర్ లో అనుకున్న తేదీకి విడుదల చేసి తీరుతాం.మీడియాలో వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ తేల్చి చెప్పారు.
ఇలాంటి పుకార్లను నమ్మి అభిమానులు గందరగోళంకు గురి అవ్వద్దు అంటూ వారు తెలియజేశారు.బాలీవుడ్ లో పుష్ప ను భారీ రేంజ్ లో విడుదల చేస్తామని గట్టిగానే చెబుతున్నారు.
మరి నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.మరి ఎలా హిందీ లో పుష్ప సినిమా లేదు అంటూ కొందరు ప్రచారం చేశారు అంటూ కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.అసలు పుష్ప విషయంలో ఏం జరుగుతోంది.షూటింగ్ బ్యాలన్స్ ఉండగానే బన్నీ గత కొన్ని రోజులుగా సినిమా వేడుకలు అంటూ తిరుగుతున్నాడు అంటూ కొందరు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయం ఏంటీ అనేది సుకుమార్ నోటి నుండి వింటే మరింత స్పష్టత వస్తుందని అభిమానులు ఆశ పడుతున్నారు.