ఒక్కోసారి కొంతమంది హీరోహీరోయిన్ల కి వచ్చి రావడంతోనే మంచి ఆరంభం లభించినప్పటికీ పలు వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమైన నటీనటులు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.2000 వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ దర్శకుడు బి.వి.వర్మ దర్శకత్వం వహించిన “శుభవేళ” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ఒరిస్సా బ్యూటీ “అనూ చౌదరి” కూడా ఈ కోవకే చెందుతుంది.కాగా ఈ అమ్మడు 1995వ సంవత్సరంలో ఓ బెంగాలీ చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది.ఆ తర్వాత పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించే అవకాశాలు వహించినప్పటికీ అనూ చౌదరి సినీ కెరీర్ మాత్రం పెద్దగా మలుపు తిరగ లేదు.
కానీ టాలీవుడ్లో శుభవేళ చిత్రంలో నటించిన తర్వాత బెంగాలీ భాషలో వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.
దీంతో ఈ అమ్మడు కొంతమేర టాలీవుడ్ సినిమా పరిశ్రమని పక్కన పెట్టింది.
అయితే అప్పట్లో అనూ చౌదరికి పలు తెలుగు చిత్రాలలో నటించే అవకాశాలు తలుపు తట్టినప్పటికీ పాత్రలు గురించి సరైన అవగాహన లేకపోవడంతో తెలుగు సినిమాలకు నో చెప్పింది.దీనికితోడు రెమ్యూనరేషన్ విషయంలో కూడా కొంత మేర అవాంతరాలు ఎదురవడంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టి వెళ్లి పోయింది.
కాగా బెంగాలీ సినీ పరిశ్రమలో వరుస అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో బెంగాలీ సినిమా పరిశ్రమకు చెందిన సందీప్ మిశ్రా అనే వ్యక్తిని ప్రేమించి 2006వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.కానీ పెళ్లయిన రెండు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
ఆ తరువాత 2010వ సంవత్సరంలో విశాల్ వర్మ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే నటి అనూ చౌదరి కేవలం సినిమాల పరంగా మాత్రమే కాకుండా పలు సోషల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటూ ప్రజలకి ఎయిడ్స్ మరియు ఇతర వ్యాధుల గురించి అవగాహన కూడా కల్పించింది.కాగా అను చౌదరి తెలుగు బెంగాలీ, కన్నడ, భాషలలో కలిపి దాదాపుగా 25కు పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కాగా ప్రస్తుతం వయసు మీద పడటంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి పరిమితమైంది నటి అనూ చౌదరి.