మహిళలు సాధారణంగా వారి ఆరోగ్యం పట్ల అంతగా శ్రద్ధ చూపరు.ఇటువంటి పరిస్థితుల్లో ముందుగానే కొన్ని వైద్యపరీక్షలు చేయించుకుంటే రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టవచ్చు.
ప్రతి ఒక్కరికి రెగ్యులర్ మెడికల్ చెకప్ అవసరం.పెరుగుతున్న వయసు జీవక్రియ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
ఫలితంగా మధుమేహం రక్తపోటు వంటి అనేక వ్యాధులకు దారితీస్తుంది.మహిళల్లో 30 ఏళ్ల వయసులో అనేక రకాల హార్మోన్ల మార్పులు మొదలవుతాయి.కచ్చితంగా ఈ వయస్సు మహిళలు 6 పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
కంప్లీట్ బ్లడ్ పిక్చర్ :
రక్తహీనత ఇన్ఫెక్షన్ కొన్ని రకాల క్యాన్సర్లను గుర్తించడానికి సీబీపీ నిర్వహిస్తారు.ఎర్ర, తెల్ల రక్త కణాలు కౌంటింగ్, హిమోగ్లోబిన్, హెమటోక్రిట్, ప్లేట్ లెట్స్ గురించి పూర్తిగా సమాచారం అందిస్తుంది.ఈ పరీక్షను 20 ఏళ్ల వయసు దాటిన మహిళలకు చాలా ముఖ్యమైనది.
మనదేశంలో చాలామంది మహిళలు ఐరన్ లోపాన్ని సహజంగా ఎదుర్కొంటున్న ఈ పరీక్ష తప్పనిసరిగా చేయించుకుని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
![Telugu Mandatory, Diabetese, Lipid Profile, Momography, Pop Sprerm, Thyroid-Telu Telugu Mandatory, Diabetese, Lipid Profile, Momography, Pop Sprerm, Thyroid-Telu](https://telugustop.com/wp-content/uploads/2021/10/Are-you-a-woman-over-30-However-these-6-tests-are-mandatoryd.jpg )
లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష :
లిపిడ్ ప్రొఫైల్.లిపిడ్స్ అని పిలిచే రక్తంలోని నిర్దిష్ట కొవ్వు అణువుల పరిమాణాన్ని కొలుస్తుంది.సీబీసీతో కొలెస్ట్రాల్ ను గుర్తించవచ్చు.
ఈ పరీక్ష గుండెజబ్బులు, రక్తనాళాల ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి సహాయపడుతుంది.ఆహార అలవాట్లు, ఒత్తిడి, వ్యాయామం, జీవనశైలిని సరిచేయడానికి లిపిడ్ ప్రొఫైల్ ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా థైరాయిడ్ లేదా పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ పేలవమైన లిపిడ్ ప్రొఫైల్ తో సంబంధం కలిగి ఉంటుంది.
![Telugu Mandatory, Diabetese, Lipid Profile, Momography, Pop Sprerm, Thyroid-Telu Telugu Mandatory, Diabetese, Lipid Profile, Momography, Pop Sprerm, Thyroid-Telu](https://telugustop.com/wp-content/uploads/2021/10/Are-you-a-woman-over-30-However-these-6-tests-are-mandatoryf.jpg )
థైరాయిడ్ టెస్ట్ :
మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారు.20 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్క మహిళా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి.ఈ పరీక్ష ద్వారా హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం గుర్తించవచ్చు.థైరాయిడ్ రుగ్మత పురుషులతో పోలిస్తే మహిళల్లో మూడు రెట్లు ఎక్కువ.35 సంవత్సరాల వయసు తర్వాత హైపోథైరాయిడిజం ప్రమాదం పెరుగుతుంది.
![Telugu Mandatory, Diabetese, Lipid Profile, Momography, Pop Sprerm, Thyroid-Telu Telugu Mandatory, Diabetese, Lipid Profile, Momography, Pop Sprerm, Thyroid-Telu](https://telugustop.com/wp-content/uploads/2021/10/Are-you-a-woman-over-30-However-these-6-tests-are-mandatorys.jpg )
మామోగ్రామ్ :
మనదేశంలో ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నారు.40 ఏళ్ల వయసు దాటిన తర్వాత మామోగ్రఫీ చేయించుకోవడం చాలా అవసరం అని క్యాన్సర్ వ్యాధి నిపుణులు సూచిస్తున్నారు.ప్రతి రెండేళ్లకు ఒకసారి మామోగ్రఫీ చేయించుకోవాలి.క్యాన్సర్ కుటుంబ చరిత్ర కలిగిన మహిళలను 20 సంవత్సరాల వయసు నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పరీక్షించాలి.
![Telugu Mandatory, Diabetese, Lipid Profile, Momography, Pop Sprerm, Thyroid-Telu Telugu Mandatory, Diabetese, Lipid Profile, Momography, Pop Sprerm, Thyroid-Telu](https://telugustop.com/wp-content/uploads/2021/10/Are-you-a-woman-over-30-However-these-6-tests-are-mandatorya.jpg )
పాప్ స్మెర్ పరీక్ష :
ఈ పరీక్ష ద్వారా గర్భాశయం లోని గత కేన్సర్ మార్పులను కొనుక్కోవచ్చ.21 సంవత్సరాల వయసు దాటిన మహిళలు ఈ పరీక్ష చేయించుకోవాలని సిఫార్సు చేయబడింది.
రక్తంలో చక్కెర :
35-49 ఏండ్ల మధ్య వయసున్న చాలా మంది మహిళలు మధుమేహం బారిన పడుతున్నారు.కొందరిలో దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నప్పటికీ.
లక్షణాలు కనిపించక పోవడం వల్ల గుర్తించలేకపోతున్నారు.డయాబెటిస్ రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం అవుతుంది.
ఇది తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది.రక్తంలో చక్కెర పరీక్షలను సాధారణ పరీక్షలతోపాటు జరిపించడం ద్వారా చక్కెరవ్యాధి పెరగకుండా చూసుకోవచ్చు.