తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందన్న విషయం అందరికీ విదితమే.కాగా ఇప్పటికే ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు నువ్వెంత అంటే నువ్వెంత అన్న రేంజ్‌లో వార్ నడిపిస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే రెండుపార్టీల నడుమ అగ్గి రాజుకుంటోంది.ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరోసారి ఈ రెండు ఆ పార్టీల నడుమ కొత్త వార్ స్టార్ట్ అయిపోయింది.
ఇప్పటికే ఉన్న వైరంతో ఒకరిపై ఒకరు తిట్ల పురాణాన్ని ఎత్తుకుంటున్నవ విషయం అందరికీ విదితమే.ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న విషయం కూడా తెలిసిందే.
ఇలాంటి ఘర్షన వాతావరణంలో ఇప్పుడు మరోసారి అమీర్ పేట వేదికగా మరో వార్ స్టార్ట్ అయిపోయింది.అదేంటంటే మొన్న రీసెంట్ గా ఈ ప్రాంతంలో ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవం వేడుక జరిగింది.
ఈ వేడకలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ప్రోటోకాల్ ను సరిగ్గా పాటించలేదంటూ ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున వివాదాన్ని రగిల్చారు.
ఈ హాస్పిటల్‌ను ప్రారంభించేందుకు కిషన్ రెడ్డితో పాటు ఇటు రాష్ట్ర మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.అయితే ఆస్పత్రి ప్రారంభోత్సవంలో భాగంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు.

ఇందులో ప్రోటోకాల్ ప్రకారం సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డి పేరు ఫస్ట్ రాయాల్సిందని కానీ అలా రాయలేదంటూ బీజేపీ కార్యకర్తలు ముందుగా వివాదానికి దిగారు.దీంతో అటు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగిపోయి నువ్వు నేనా అన్న రేంజ్లో ఆందోళన చేశారు.ఏకంగా పరస్పరం దాడులకు కూడా దిగిపోయారు.
దీంతో అటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.ఇక తలసాని కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు.
ఇలా మరోసారి ఇరు పార్టీల నడుమ వార్ మొదలయింది.
.