బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 5 గత సీజన్ల స్థాయిలో లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.లవ్ ట్రాకులు లేకపోవడం, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లేకపోవడం, ప్రేక్షకులు మెచ్చే టాస్క్ లు లేకపోవడంతో ఈ సీజన్ బోరింగ్ గా ఉందని సాధారణ ప్రేక్షకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5 వీక్ డేస్ రేటింగ్స్ తక్కువగా ఉండటంతో ఈ సీజన్ ఫ్లాప్ అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఈ వారం ఎలిమినేషన్ కు ఏకంగా పది మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు.
నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో షణ్ముఖ్ జశ్వంత్, జెస్సీ, సన్నీ, శ్వేత, విశ్వ, ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామచంద్ర, రవి, సిరి ఉన్నారు.ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల జాబితాను పరిశీలిస్తే నలుగురు ఫిమేల్ కంటెస్టెంట్లు, ఒక మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు.
అందువల్ల ఈ వారం మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నయని తెలుస్తోంది.విశ్వ లేదా జెస్సీలలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.లోబోకు కూడా క్రేజ్ తగ్గుతున్నా బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తుండటం అతనికి ప్లస్ అవుతోంది.బిగ్ బాస్ షోలో మార్పులు చేసి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించాలని బిగ్ బాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బిగ్ బాస్ షో కంటే బిగ్ బాస్ షో ప్రోమోలే బాగున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.వీకెండ్ ఎపిసోడ్ లకు పరవాలేదనే స్థాయిలో రేటింగ్స్ వస్తుండగా రాబోయే రోజుల్లో వీక్ డేస్ రేటింగ్ మరింత తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందో లేదో చూడాల్సి ఉంది.